హైదరాబాద్: తనతో పాటు ఆడిన నీతిమంతమైన బౌలర్లలో ఆశిష్ నెహ్రా ఒకడని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. 38 ఏళ్ల నెహ్రా బుధవారం తన సొంత మైదానమైన ఫిరోజ్ షా కోట్లా వేదికగా న్యూజిలాండ్‌తో తన చివరి మ్యాచ్ ఆడాడు.
అయితే తన కెరీర్‌లో ఆడిన చివరి మ్యాచ్‌లో నెహ్రా వికెట్ తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో నెహ్రా 4 ఓవర్లు వేసి 29 పరుగులిచ్చాడు. మున్రో ఇచ్చిన సునాయసమైన క్యాచ్‌ను పాండ్యా విడిచిపెట్టడంతో నెహ్రాకు వికెట్ దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇచ్చిన మరో క్యాచ్‌ను కోహ్లీ జార విడిచాడు.

మ్యాచ్ అనంతరం నెహ్రా జట్టులోని తన సహచర క్రికెటర్లతో స్టాండ్స్ వైపు అభివాదం చేస్తూ స్టేడియమంతా తిరిగాడు. కొంత దూరం వెళ్లాక కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్ అతడిని భుజాల మీదికి ఎత్తుకుని విజయ గర్వంతో ఘనంగా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. నెహ్రా వీడ్కోలు నేపథ్యంలో షోయబ్ అక్తర్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
నెహ్రా రిటైర్మెంట్‌పై అక్తర్ మాట్లాడుతూ తనతో పాటు ఆడిన నీతిమంతమైన ఫాస్ట్ బౌలర్లలో నెహ్రా ఒకడని కొనియాడాడు. 'ఆయనతో కలసి ఆడటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని, నెహ్రా స్వతహాగా ఓ మంచి వ్యక్తి. తదుపరి నెహ్రా తన జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశాడు.
కాగా, తన చివరి మ్యాచ్‌లో గ్రౌండ్‌లో దూసుకొచ్చి నెహ్రా కాళ్లు మొక్కే అభిమాని కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయే ఘటన మనకు కనిపించింది. భారత క్రికెట్‌లో మహా దిగ్గజాలైన వీరేంద్ర సెహ్వాగ్‌కు, వీవీఎస్ లక్ష్మణ్‌కు, జహీర్ ఖాన్‌లకు కూడా సాధ్యం కాని ఫెర్‌వెల్ మ్యాచ్ నెహ్రాకు లభించిన సంగతి తెలిసిందే.