
అక్షర్ తెలివైన బౌలర్
తాజాగా షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ... 'అక్షర్ పటేల్ స్పిన్‌కు అనుకూలించే వికెట్ మీద మాత్రమే కాదు.. ఎక్కడైనా బాగా బౌలింగ్ చేయగలడు. ఎందుకంటే.. అతడో తెలివైన బౌలర్. ఇంగ్లీష్ ఆటగాళ్లకు అతడు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇలాంటివి మరికొన్ని ప్రదర్శనలు చేస్తే అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా అక్షర్ నిలుస్తాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు' అని అన్నాడు. గతంలో ఇలాంటి పిచ్‌లపై తాను వేగంగా బౌలింగ్ చేశానని, ఇప్పుడు మాత్రం పేసర్లు వేగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అభిప్రాయపడ్డాడు.

ఇంగ్లండ్ ఎలా కోలుకుంటుందో:
'టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టుకిది ఘోర పరాభవం. భారత్‌లో ఎలా ఆడాలనే విషయంపై ఇప్పుడా జట్టు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఉప ఖండంలో స్పిన్ పిచ్‌లపై ఎలా బ్యాటింగ్ చేయాలో కచ్చితంగా నేర్చుకోవాలి. భవిష్యత్‌లో బాగా ఆడేందుకు ఇంగ్లీష్ ఆటగాళ్లు.. ఈ ఓటమి నుంచి ఎలా తేరుకుంటారో, ఎలా ప్రేరణ చెందుతారో తెలియదు' అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. నాలుగో టెస్ట్ విజయంతో భారత్ 3-1 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకోవడమే కాకుండా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో చోటు దక్కించుకున్నా విషయం తెలిసిందే.

టీమిండియా ఆటగాళ్లు ఎలా ఆడారు:
పలువురు ఇంగ్లండ్ మాజీలు పిచ్‌ల గురించి విమర్శించిన నేపథ్యంలో పాక్ మాజీ పేసర్ అక్తర్ స్పందించాడు. 'టెస్ట్ సిరీస్‌లో కొంత మంది వికెట్ల గురించి మాట్లాడారు. కానీ భారత్ అదే పిచ్‌పై భారీ స్కోర్ ఎలా సాధించింది?. ఇంగ్లీష్ ఆటగాళ్లు విఫలమైన వికెట్‌పైనే టీమిండియా ఆటగాళ్లు ఎలా ఆడారు?. రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్ లాంటి యువ క్రికెటర్లు పరుగులు చేసినప్పుడు పర్యాటక జట్టు ఆటగాళ్లు ఎందుకు ఆడలేకపోయారు?. భారత్ ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టింది' అని అక్తర్ అన్నాడు.

పీసీబీ ఫైర్
కరోనా కేసులు పెరగడంతో ఆటగాళ్ల ఆరోగ్యం, క్షేమం దృష్ట్యా పీఎస్ఎల్ 2021 టోర్నీని వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గతవారం పేర్కొంది. దీనిపై తాజాగా అక్తర్ స్పందిస్తూ... సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారని, బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఆటగాళ్ల జీవితాలను ప్రమాదంలోకి నెట్టడమే కాకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరువు కూడా పోయిందని మాజీ పేసర్ అక్తర్ చెప్పుకొచ్చాడు. అక్తర్ పాక్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు.
India vs England: టీ20 సిరీస్ ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్ ఔట్! ఐపీఎల్ 2021కు డౌటే!