Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనుష్క.. నువ్వు ఐరన్ లేడివి..! పొగిడిన షోయబ్ అక్తర్

 Shoaib Akhtar Praised Anushka Sharma is A Iron Lady and Virat is made of Steel

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ టీ20ల్లో తన తొలి సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక సెంచరీ అనంతరం విరాట్ మాట్లాడుతూ.. తన విజయం వెనుక ఉందని అనుష్క శర్మ ఉందని పేర్కొన్నాడు. ఇక కోహ్లీ సక్సెస్‌లో, కష్టాల్లో వెన్నంటి ఉన్నందుకు అనుష్క శర్మను మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ప్రశంసించాడు. ఇక ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 61బంతుల్లో 122పరుగులు చేశాడు. కోహ్లీ ధనాధన్ ఇన్నింగ్స్‌కు తోడు కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో భారత్ 20ఓవర్లలో 212పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత భువనేశ్వర్ కుమార్ 5వికెట్ల హాల్‌తో చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో భారత్ 101పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. న్నింగ్స్ విరామ సమయంలో, కోహ్లీ తన సెంచరీని తన భార్య అనుష్క, కుమార్తె వామికాకు అంకితం చేశాడు.

'ఈ కష్ట సమయాల్లో నాకు అనుష్క చాలా అండగా నిలబడింది. నేను ఆమె గురించి ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకున్నాను. కొన్ని నెలల పాటు నేను పేలవ ఫాంలో ఉన్నప్పుడు ఆమె నా వెన్నంటే ఉంది. ఆమె నా కోసం అన్ని విషయాలను పట్టించుకునేది. నాకు సరైన రకమైన మార్గదర్శకత్వం ఇస్తూనే ఉండేది. నా దృష్టి మున్ముందు జరిగే టోర్నీలపై ఉంది. నేను రిలాక్స్డ్ పర్సన్‌గా మళ్లీ క్రికెట్లోకి తిరిగి వచ్చాను' అని కోహ్లీ చెప్పాడు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో షోయాబ్ అక్తర్ మాట్లాడుతూ.. కోహ్లీ విజయం వెనుక అనుష్క ఉందని అక్తర్ ప్రశంసించాడు. 'విరాట్ కోహ్లి తన మ్యాచ్ అనంతర ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భార్య గురించి మాట్లాడాడు. హ్యాట్సాఫ్ టు అనుష్క శర్మ.. మీరు ఒక ఉక్కు మహిళ, ఉక్కు కండరాలతో తయారైన వ్యక్తి మిస్టర్ విరాట్ కోహ్లీ' అని అక్తర్ ప్రశంసించాడు. 'విరాట్ కోహ్లీ మీకు అభినందనలు , మీరు గొప్ప మనసున్న పర్సన్. మీరిలాగే ఎదుగుతూ ఉండాలి. ఎప్పటికీ క్రికెట్ చరిత్రలో గ్రేటెస్ట్ ప్లేయర్‌గా మిగిలిపోతారు' అని అక్తర్ పేర్కొన్నాడు.

Story first published: Friday, September 9, 2022, 14:31 [IST]
Other articles published on Sep 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+