ఆధునిక క్రికెట్‌లో కోహ్లీకి బౌలింగ్ చేయడం చాలా కష్టం: అక్తర్

కరాచీ: ఆధునిక క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడం చాలా కష్టం అని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అంటున్నాడు. రిటైర్మెంట్ అనంతరం అక్తర్ తన యూ ట్యూబ్, సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులకు ఎప్పటికీ టచ్‌లోనే ఉంటున్నాడు. సందర్భాన్ని బట్టి పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు విదేశీ క్రికెటర్లను ప్రశంసల్లో ముంచెత్తుతాడు. అదే విధంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తాడు. మొత్తానికి క్రికెట్ విశ్లేషకుడిగా అక్తర్ కొనసాగుతున్నాడు.

కోహ్లీకి బౌలింగ్ చేయడం చాలా కష్టం
తాజాగా అభిమానులతో అక్తర్ ప్రశ్నలు-సమాధానాల సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ ఫ్యాన్ నుండి అక్తర్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. ఈ ఆధునిక క్రికెట్‌లో ఎవరికి బౌలింగ్ చేయడం కష్టం అని ఒక అభిమాని అడిగాడు. ఇందుకు ఎటువంటి తడబాటు లేకుండా విరాట్ కోహ్లీ అని సమాధానమిచ్చాడు. 'ఆధునిక క్రికెట్‌లో కోహ్లీకి బౌలింగ్ చేయడం చాలా కష్టం. అతడు ఒక కఠినతరమైన బ్యాట్స్‌మన్' అని అక్తర్ పేర్కొన్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా కోహ్లీకి అక్తర్ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.

బాస్ భారత్
రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ప్రదర్శనపై అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియాను 'బాస్' ఆఫ్ ది గేమ్ అంటూ అభివర్ణించాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'ఈ మ్యాచ్‌తో బాస్ ఎవరో భారత్ నిరూపించింది. ఈ సిరిస్లో తొలి గేమ్‌ను కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. రోహిత్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతడిలో గొప్ప టాలెంట్ ఉంది. అతను కోరుకున్నప్పుడల్లా పరుగులు చేయగలడు' అని అక్తర్ అన్నాడు.

తొలి డే/నైట్ టెస్ట్:
బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను గెలిచిన టీమిండియా టెస్టు సిరీస్‌పై కూడా కన్నేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించి.. రెండో టెస్టుకు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా రెండో టెస్టు నవంబర్ 22న ప్రారంభం కానుంది. టీమిండియా ఆడబోతున్న తొలి డే/నైట్ టెస్ట్ మ్యాచ్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఈడెన్‌పైనే ఉంది. భారత్-బంగ్లాదేశ్‌తో తొలి డే/నైట్ టెస్టు ఆడనుండగా.. కోల్‌కతాలో పింక్ సందడి జోరందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications