Shoaib Akhtar All-Time ODI XIలో నలుగురు భారత ఆటగాళ్లకు చోటు.. కెప్టెన్ ధోనీ కాదు! కోహ్లీ దక్కని చోటు!!

ఇస్లామాబాద్: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్, ఐసీసీ టోర్నీలు, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల సమయాల్లో దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. ఇప్పుడు కరోనా కారణంగా ఖాళీగా ఉండడంతో పలువురు తమతమ డ్రీమ్ జట్లను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఆల్‌టైం ఎలెవెన్ వన్డే జట్టును ప్రకటించగా.. తాజాగా పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఈ జాబితాలో చేరిపోయాడు.

నలుగురు భారత క్రికెటర్లకు స్థానం:
ఇటీవలి కాలంలో క్రికెటర్లు చాలా మంది తమ ఆల్ టైం జట్లను ప్రకటిస్తున్నారు కదా?.. షోయబ్ అక్తర్ ప్రకటించడంలో కొత్తగా ఏముంటుంది? అని అనుకోకండి. అక్తర్ ప్రకటించిన జట్టులో ఏకంగా నలుగురు భారత క్రికెటర్లకు స్థానం కల్పించాడు. అదే ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పాకిస్తాన్ ఆటగాడైనా.. భారత ఆటగాళ్ల ప్రతిభను గౌరవించి నలుగురిని తన ఆల్‌టైం జట్టులో చేర్చడం నిజంగా గొప్ప విషయమని అందరూ ప్రశంసిస్తున్నారు. ఉన్న 11 మందిలో ఒకే దేశానికి చెందిన నలుగురికి అవకాశం ఇవ్వడం మామూలు విషయం కాదు. అయితే అక్తర్ తన జట్టులో పాకిస్తాన్ ఆటగాళ్లను కూడా నలుగురికి స్థానం కల్పించడం విశేషం.

కీపర్‌గా ధోనీ:
షోయబ్ అక్తర్ తన ఆల్‌టైం ఎలెవెన్ వన్డే జట్టుకు ఓపెనర్లుగా టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ మాజీ ఆటగాడు జీ గ్రీనిడ్జ్‌లను ఎంపిక చేశాడు. కీలక వన్ డౌన్‌లో పాక్ మాజీ కెప్టెన్ ఇంజమాన్ ఉల్ హక్‌కు అవకాశం ఇవ్వగా.. 4వ స్థానంలో పాకిస్తాన్ మాజీ సూపర్ ఓపెనర్ సయీద్ అన్వర్‌ని ఎంచుకున్నాడు. 5వ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని తీసుకున్నాడు. వికెట్ కీపర్‌గా మహీకి అవకాశం దక్కినా.. సారథిగా మాత్రం అక్తర్ అతడిని ఎంచుకోలేదు. 6వ స్థానంలో ఆసీస్ లెజెండ్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, 7వ స్థానంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌లకు స్థానం లభించింది.

కెప్టెన్‌గా వార్న్:
8వ స్థానంలో పాకిస్తాన్ లెజెండరీ ఆల్‌రౌండర్ వసీం అక్రమ్‌ను షోయబ్ అక్తర్ ఎంచుకున్నాడు. 9వ స్థానంలో పాక్ మాజీ లెజెండ్ వకార్ యూనిస్, 10వ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌లకు అవకాశం దక్కింది. 11వ స్థానంలో ఆసీస్ లెజెండరీ స్పిన్నర్ షేన్ వాట్సన్ ఉన్నాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా వార్న్‌ను ఎంపికచేశాడు అక్తర్. అయితే ఈ జట్టులో కొందరు ఆటగాళ్ల కూర్పులో వారు ఎక్కవగా ఆడిన స్థానాల్లో కాకుండా వేరు వేరు స్థానాల్లో ఉంచడం గమనార్హం. ఇంగ్లండ్, న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా లాంటి అగ్రశ్రేణి జట్లకు చెందిన ఒక్కరిని కూడా రావల్పిండి ఎక్స్‌ప్రెస్ తీసుకోలేదు.

షోయబ్ అక్తర్ ఆల్‌టైమ్ వన్డే టీమ్:
గోర్డాన్ గ్రీనిడ్జ్, సచిన్ టెండూల్కర్, ఇంజమామ్-ఉల్-హక్, సయీద్ అన్వర్, ఎంఎస్ ధోనీ (కీపర్), ఆడమ్ గిల్‌క్రిస్ట్, యువరాజ్ సింగ్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, కపిల్ దేవ్, షేన్ వార్న్ (కెప్టెన్).
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications