
టీ20ప్రపంచకప్ 2022 తర్వాత విరాట్ కోహ్లీ టీ20ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని మాజీ పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ జోస్యం చెప్పాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2022 అక్టోబర్ 16నుంచి నవంబర్ 13వరకు ఆస్ట్రేలియాలో జరగనున్న సంగతి తెలిసిందే. 'కోహ్లీ టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఇతర ఫార్మాట్లలో అతను సుదీర్ఘకాలం ఆడేందుకు అతను టీ20లకు వీడ్కోలు చెప్పవచ్చు.
నేనే గనుక కోహ్లీ అయి ఉంటే టీ20లకు రిటైర్ ఇచ్చేసి.. వన్డేలు, టెస్టుల మీద ఫోకస్ పెట్టి ఉండేవాడిని' అని అక్తర్ తన లైవ్ సెషన్‌లో చెప్పాడు. ఇకపోతే ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో కోహ్లీ మునుపటి టచ్ చూపిస్తూ.. తన 71వ అంతర్జాతీయ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే కెరీర్లో తన తొలి టీ20I సెంచరీ చేయడంతో పాటు అలాగే భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ నిలిచాడు. కోహ్లీ ఆసియాకప్ టోర్నీలో ఐదు మ్యాచ్‌లలో 276పరుగులతో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కూడా నిలిచాడు.
ఇకపోతే 2019 నవంబర్ నుంచి కోహ్లీ ఫామ్ కోల్పోవడంతో పాటు మూడేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. యుఏఈలో జరిగిన ఆసియాకప్ ద్వారా మళ్లీ అతను తన మునుపటి ఫామ్ అందుకున్నాడు. సెంచరీ కరువు కూడా తీర్చుకున్నాడు. ఆసియా కప్ నుండి భారత్ సూపర్ 4దశలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లీ మళ్లీ పీక్ ఫామ్ అందుకున్నాక పాకిస్థాన్ మాజీ ప్లేయర్లు మళ్లీ కోహ్లీని టార్గెట్ చేస్తున్నారు. మొన్నటివరకు పేలవ ఫాంలో ఉండగా..
కోహ్లీ తప్పకుండా పుంజుకుంటాడని ఒక్క భారీ ఇన్నింగ్స్ చాలు మళ్లీ అతను ఫాంలోకి వచ్చి చెలరేగడానికి అంటూ కామెంట్లు చేసిన వాళ్లు ఇప్పుడేమో కోహ్లీ కెరీర్ ఫాంలో ఉన్నప్పుడే రిటైర్ అయితే మంచిదంటూ వక్రభాష్యాలు చెబుతున్నారు. నిన్న షాహిద్ అఫ్రిది సైతం కోహ్లీ తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలని.. అది అతను సగర్వంగా వీడ్కోలు పలికినట్లు అవుతుందని వ్యాఖ్యానించాడు. తాజాగా అక్తర్ సైతం అదే రకంగా మాట్లాడాడు. దీన్ని బట్టి వరల్డ్ కప్ 2022లో కోహ్లీ ఇదే ఫాంలో ఉంటే.. భారత్‌కు తిరుగుండదు.. విశ్వవిజేతగా కూడా అవతరించే అవకాశాలుంటాయని వాళ్ల ఇంటెన్షన్ అని అర్థమవుతుంది. ఏదేమైనా కోహ్లీ ఫామ్ చూసి పాక్ మాజీ ప్లేయర్ల ఆటగాళ్లు కుళ్లుకుంటున్నారనేది మాత్రం తెలుస్తోంది.