
భారత్ చాలా మెరుగయింది:
సోమవారం అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'ఇటీవలి కాలంలో భారత్ చాలా మెరుగయింది. జట్టులోని ప్రతి ఒక్కరు అద్భుతంగా ఆడుతున్నారు. కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్ కూడా దూకుడుగా ఆడే ఆటగాళ్లను కలిగి ఉంది. అయితే వారిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతోంది. గతంలో పాక్ ఎంతో దూకుడుగా ఆడేది' అని గుర్తు చేసాడు.

టీమిండియాను అనుసరించాలి:
'పాక్ కోచ్ మిస్బా, కెప్టెన్ అజర్‌లు టీమిండియా, కోహ్లీని అనుసరించాలి. ఇద్దరు పాకిస్థాన్‌ను మరింత బలంగా తీర్చిదిద్దాలి. టీమిండియా కంటే ఉత్తమ జట్టుగా మార్చాలి. పాకిస్తాన్ ఆటగాళ్లు టీమిండియా, కోహ్లీలా ఆడాలి ఆడితేనే ఇది సామధ్యమవుతుంది. కోహ్లీ శారీరకంగా చాలా దృఢంగా ఉంటాడు. అతన్ని అనుసరిస్తున్న టీమిండియా ఆటగాళ్లు అలాగే కనిపిస్తారు. ఒక కెప్టెన్ బాధ్యతగా ఉండి ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తే ఆ జట్టు ఆటగాళ్లు కూడా కచ్చితంగా అతడిని అనుసరిస్తారు. కోహ్లీనే ఇక్కడ ఓ ఉదాహరణ' అని అక్తర్ తెలిపాడు.

కోహ్లీ కూడా అదే చేస్తున్నాడు:
'పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మైదానంలోకి వచ్చాక ఎవరి మాటలు వినేవాడు కాదు. మైదానం చుట్టూ పరుగులు తీసి, వ్యాయామం చేసిన తర్వాత మూడు గంటల పాటు నెట్స్‌లో సాధన చేసేవాడు. అప్పుడు ఇతర ఆటగాళ్లు కూడా కచ్చితంగా అలాగే చేయాల్సి ఉండేడి. ఇప్పుడు కోహ్లీ కూడా అదే చేస్తున్నాడు. అతడు చాలా కచ్చితత్వంతో ఆడతాడు. టీమిండియా ఆటగాళ్లు కూడా అతడిని అనుకరిస్తారు. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్‌లో ఆటగాళ్ల పట్ల టీమిండియా కఠినంగా ఉంటుంది. అలాగే ఉండాలి' అని అక్తర్ అన్నాడు.

ఇలాంటి ఫలితాలే రాబట్టాలి:
'ప్రస్తుతం పాకిస్థాన్ భయపడకుండా ఆడాల్సిన అవసరం ఉంది. ఆటగాళ్లలో సోదర భావం ఏర్పడాలి. కెప్టెన్, కోచ్ ఆటగాళ్లు అందరూ పూర్తి ఫిట్‌గా ఉండేలా చూడాలి. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో పాక్ మంచి ప్రదర్శన చేసింది. చాలా ఏళ్ల తర్వాత సొంత గడ్డపై సిరీస్ గెలిచాం. ఆనందంగా ఉంది. పాక్ భవిష్యత్‌లోనూ ఇలాంటి ఫలితాలే రాబట్టాలి' అని అక్తర్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












