అక్తర్ బౌలింగ్.. పిచ్‌లోనే కూలబడిన క్రికెట్ దిగ్గజం (వీడియో)!!

కరాచీ: పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గంటకు 160 కి.మీ వేగంతో బంతుల్ని సంధింస్తాడు. తన హయాంలో ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీతో పోటీ మరీ పడి బౌలింగ్ చేసేవాడు. లీ, అక్తర్ బౌలింగ్‌ను అంచనా వేయడంలో ఏమాత్రం విఫలమైనామిక అంతే సంగతులు. వీరి బౌలింగ్‌లో ప్రపంచ దిగ్గజ బ్యాట్స్‌మన్‌లు ఎందరో గాయపడ్డారు. అయితే కరోనా పుణ్యమాని మాజీలు తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా తన బౌలింగ్‌లో గాయపడిన క్షణాలను అక్తర్ గుర్తు చేసుకున్నాడు.
పిచ్‌లోనే కూలబడిన లారా:
2004లో చాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో భాగంగా విండీస్, పాక్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో షోయబ్ అక్తర్ షార్ట్ పిచ్ బంతిని వేగంగా సంధించాడు. అయితే ఆ బంతిని షాట్ కొడదామని ముందుగా ఫిక్స్ అయిన బ్రియాన్ లారా.. చివరి దశలో తన ఆలోచనను మార్చుకున్నాడు. కానీ ఆ బంతి వేగంగా వచ్చి హెల్మెట్ చివరలో బలంగా తాకింది. వెంటనే లారా క్రీజులో విలవిల్లాడిపోయాడు. తలను పట్టుకుని పిచ్‌లోనే కూలబడిపోయాడు. అయితే అక్తర్ వచ్చి లారాను లేపే ప్రయత్నం చేసాడు.

లారాను గాయపరిచిన మూమెంట్:
ఆ ఘటనకు సంబందించిన క్షణాలు నిజంగా భయంకరమైనవి. లారాకు ఏమైందో అనే కంగారు అటు పాక్ శిబిరంలోనూ, ఇటు విండీస్ శిబిరంలోనూ నెలకొంది. అయితే లారాకు ఎలాంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియోను అక్తర్ తాజాగా తన ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. 'క్రికెట్ గేమ్‌లో ఒక లెజెండ్ లారా. ఆనాడు లారాను గాయపరిచిన మూమెంట్. నా కెరీర్‌లో ఒక జ్ఞాపకం. అతని శకంలో ఉత్తమ బ్యాట్స్‌మన్ లారా. లారాతో ఆటను ఎప్పుడూ ఆస్వాదించే వాడిని' అని అక్తర్ పేర్కొన్నాడు.

46 టెస్టుల్లో 176 వికెట్లు:
అక్తర్, లీ కేవలం బౌలింగ్ చేయడం మాత్రమే కాదు.. అప్పుడప్పుడు బ్యాటింగ్‌లో కూడా చెలెగేవారు. అయితే బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రం బ్రెట్ లీ ప్రతీ బౌలర్‌కు భయపడేవాడని అక్తర్ పేర్కొన్నాడు. లీ ఆసీస్ తరపున 76 టెస్టుల్లో 310 వికెట్లు, 221 వన్డేల్లో 380 వికెట్లు తీశాడు. ఇక అక్తర్ పాక్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు పడగొట్టాడు.

క్రికెట్ చరిత్రలోనే మరెవరికీ సాధ్యం కాని రికార్డు:
సంప్రదాయం ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 400 పరుగులు. అసాధ్యమైన ఈ రికార్డు విండీస్ వీరుడు బ్రియాన్ లారా సుసాధ్యం చేశాడు. 2004, ఏప్రిల్ 12న సెయింట్ జాన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో లారా ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 582 బంతులు ఎదుర్కొన్న లారా ఏకంగా 43 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications