Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షోయ‌బ్ అక్త‌ర్‌కు భారీ షాక్.. 10 కోట్ల ప‌రువు న‌ష్టం దావా!!

Shoaib Akhtar faces defamation and criminal proceedings from PCBs legal advisor Taffazul Rizvi

కరాచీ: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్‌కు ఊహించని షాక్ తగిలింది. తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా వేదిక‌గా త‌ర‌చూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్న అక్త‌ర్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లీగ‌ల్ అడ్వైజ‌ర్ ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఉమ‌ర్ అక్మ‌ల్‌పై మూడేళ్ల నిషేధం విష‌యంలో అక్త‌ర్ తన ఛానల్ యూట్యూబ్ వీడియోలో అభ్యంతరం వ్యక్తం చేసాడు. ఉమర్‌ను సమర్థించడమే అసలుకే ఎసరొచ్చింది.

అక్త‌ర్‌పై ప‌రువు న‌ష్టం దావా:

అక్త‌ర్‌పై ప‌రువు న‌ష్టం దావా:

షోయ‌బ్ అక్త‌ర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడన్న విషయం తెలిసిందే. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అక్త‌ర్ ఒక్క పాకిస్థాన్ ఆటగాళ్లు, బోర్డుపైనే కాకుండా అన్ని దేశాలపై తన అభిప్రాయాలను తెలిపేవాడు. ఇటీవలే కరోనా వైరస్ విజృంభ‌ణ నేప‌థ్యంలో భార‌త్‌-పాకిస్తాన్ వ‌న్డే సిరీస్ నిర్వహించాని అక్త‌ర్ సూచించాడు. దీంతో భార‌త మాజీ ఆట‌గాళ్ల‌తో చివాట్లు తిన్నాడు. తాజాగా ఉమర్‌ అక్మల్‌కు పీసీబీ మూడేళ్ల నిషేధం విధించగా.. ఈ విష‌యంలో అక్త‌ర్ యూట్యూబ్ వీడియోలో అసంబ‌ద్ధ వ్యాఖ్య‌లు చేశాడు. దీంతో ఆగ్ర‌హించిన లీగ‌ల్ అడ్వైజ‌ర్ త‌ఫ‌జ్జుల్ రిజ్వీ క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయ‌డంతో పాటు 10 కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేశారు.

అక్త‌ర్ నోరు అదుపులో పెట్టుకో:

అక్త‌ర్ నోరు అదుపులో పెట్టుకో:

'లీగ‌ల్ అంశాల‌పై మాట్లాడేట‌ప్పుడు షోయ‌బ్ అక్త‌ర్ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. వీడియోలో అత‌డు వాడిన భాష ఏమాత్రం ఆమోద యోగ్యంగా లేదు. అందుకే పీసీబీ న్యాయ సలహాదారు మిస్టర్ త‌ఫ‌జ్జుల్ రిజ్వీ తన స్వంత అభీష్టానుసారం అక్తర్‌పై క్రిమినల్ కేసు పెట్టి పరువు నష్టం దావా వేశారు' అని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. రిజ్వీని ఎగతాళి చేశాడు, బోర్డు మరియు ఆటగాళ్ల విషయంలో నిత్యం తలదూర్చుతూ ఉన్నాడు అని కూడా తెలిపింది.

నజీర్‌కు బుర్ర లేదు:

నజీర్‌కు బుర్ర లేదు:

తాజాగా ఓ టీవీ షోలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ... 'వీరేంద్ర సెహ్వాగ్‌కు ఉన్న బుర్ర ఇమ్రాన్ నజీర్‌కు ఉందని నేను అనుకోను. ఇమ్రాన్‌కు ఉన్న టాలెంట్ సెహ్వాగ్‌కి లేదుని నా అభిప్రాయం. ఇక్కడ ప్రతిభ, పోలికకు సంబంధం లేదు. భారత్‌పై విధ్వంసక సెంచరీ బాదిన తర్వాత నిలకడగా ఆడాలని నజీర్‌కి నేను సూచించాను. కానీ.. అతను నా మాటలు పట్టించుకోలేదు. దురదృష్టవశాత్తు అతడి సేవల్ని జట్టు ఎక్కువకాలం వినియోగించుకోలేకపోయింది. సెహ్వాగ్ కంటే ఇమ్రాన్ బెటర్ ప్లేయర్.. మంచి ఫీల్డర్' అని అన్నాడు.

అక్రమ్‌ని చంపేసేవాడిని

అక్రమ్‌ని చంపేసేవాడిని

'1990 నుంచి మ్యాచ్‌లు చూసేవాడ్ని. ఎన్నో మ్యాచ్‌ల్లో వసీం అక్రమ్ తన అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్ జట్టుని గెలిపించడం నేను చూశాను. ఒకవేళ అక్రమ్​ నన్ను మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని అడిగి ఉంటే.. అతడి కచ్చితంగా నాశనం చేసేవాడిని. చంపేందుకు కూడా వెనుకాడేవాడిని కాదు. అయితే అక్రమ్ నా వద్ద ఫిక్సింగ్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు' అని అక్తర్ వెల్లడించాడు. ఇలా పాక్ ఆటగాళ్లను కూడా అక్తర్ ఏకిపారేసేవాడు.

Story first published: Thursday, April 30, 2020, 11:19 [IST]
Other articles published on Apr 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+