న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షోయబ్‌ అక్తర్‌కు ఫోన్‌ చేసి బాధపడ్డ టీమిండియా పేసర్‌.. ఎందుకో తెలుసా?!!

Shoaib Akhtar believes Shami can become the ‘king of reverse swing’

ఇస్లామాబాద్‌: సాగర తీరం విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన భారత పేసర్‌ మహ్మద్‌ షమీ.. పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్‌కు ఫోన్‌ చేసి బాధపడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు. టీమిండియా తొలి టెస్టు విజయం అనంతరం షోయబ్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ షమీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌ నుంచి వైదొలిగాక షమీ తనకు ఫోన్‌ చేసి తనతో మాట్లాడాడని తెలిపాడు.

<strong>లియాండర్‌ పేస్‌తో తలపడ్డ ధోనీ.. విజయం ఎవరిదంటే?!!</strong>లియాండర్‌ పేస్‌తో తలపడ్డ ధోనీ.. విజయం ఎవరిదంటే?!!

రివర్స్‌ స్వింగ్‌కి కింగ్‌:

రివర్స్‌ స్వింగ్‌కి కింగ్‌:

తాజాగా అక్తర్‌ మాట్లాడుతూ... 'షమీ సీమ్‌ బౌలింగ్‌తో పాటు స్వింగ్‌ బౌలింగ్‌ చేయగలడు. అన్నిటికన్నా ముఖ్యంగా రివర్స్‌స్వింగ్‌ చేయగలడు. ఇలాంటి నైపుణ్యం ఉపఖండంలో కొద్దిమంది బౌలర్లకు మాత్రమే ఉంటుంది. నువ్ ఏదో ఒకరోజు రివర్స్‌ స్వింగ్‌కి కింగ్‌ అవుతావు అని అప్పుడే చెప్పా. తాను చెప్పినట్లే విశాఖలో వికెట్లు తీశాడు. కెప్టెన్ విరాట్ కొహ్లీ కెప్టెన్సీలో షమీ అద్భుతంగా రాణిస్మింస్తునాడు. కోహ్లీ బౌలర్లకు స్వేచ్ఛనిస్తాడు' అని షోయబ్‌ అక్తర్‌ అన్నాడు.

సెహ్వాగ్‌ కంటే రోహిత్‌ టెక్నిక్‌ బాగుంటుంది:

సెహ్వాగ్‌ కంటే రోహిత్‌ టెక్నిక్‌ బాగుంటుంది:

టెక్నిక్‌ విషయంలో వీరేంద్ర సెహ్వాగ్‌ కంటే రోహిత్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ బాగుంటుందని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. '2013లో బంగ్లాదేశ్‌లో ఓ జిమ్‌లో రోహిత్‌ను కలిశాను. వెంటనే త్వరలో నీ పేరు ముందు గ్రేట్‌ అనే పదం చేరుతుంది అని చెప్పా. ఇప్పుడు అది స్పష్టమైంది. ఆలోచన దోరణిలో, షాట్ల ఎంపికలో టీమిండియాలో రోహిత్‌ కంటే బెటర్‌ బ్యాట్స్‌మన్‌ లేడనే భావన అప్పుడూ.. ఇప్పుడూ ఉంది. ఇక బ్యాటింగ్‌ టెక్నిక్‌ విషయంలో సెహ్వాగ్‌ కంటే రోహిత్‌ చాల బెటర్‌. సెహ్వాగ్‌ మైదానం నలువైపులా బంతిని పంపించేలా దూకుడుగా ఆడగలడు. కానీ రోహిత్‌ షాట్ల ఎంపికలో వైవిధ్యం ఉంటుంది. టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్‌ రావడంతో టీమిండియాలో పోటీ పెరిగింది. త్వరలోనే అన్ని ఫార్మట్లలో రోహిత్‌ నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌గా నిలవడం ఖాయం' అని అక్తర్‌ పేర్కొన్నాడు.

కోహ్లీ బౌలర్ల మాటకు విలువ ఇస్తాడు:

కోహ్లీ బౌలర్ల మాటకు విలువ ఇస్తాడు:

ఆదివారం మ్యాచ్‌ అనంతరం షమీ మాట్లాడుతూ... 'కెప్టెన్‌ కోహ్లీ బౌలర్ల మాటకు విలువ ఇస్తాడు. తమకు ఇష్టమొచ్చినట్లు బౌలింగ్‌ చేయడానికి పూర్తి స్వేచ్ఛనిస్తాడు. కోహ్లీ తమని గౌరవించి నమ్ముతాడు. అలాగే తామూ కెప్టెన్‌పై విశ్వాసంతో ఉంటామని షమీ వివరించాడు. తొలి టెస్టులో విజయం సాధించిన టీమిండియా రెండో టెస్టు కోసం సోమవారం పుణెకు చేరుకుంది. గురువారం నుంచి ఇరు జట్లు రెండో పోరులో తలపడనున్నారు

Story first published: Tuesday, October 8, 2019, 18:22 [IST]
Other articles published on Oct 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X