
హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్‌లో తండ్రీ కొడుకులు కలిసి ఆడటం అంటే అదొక అద్భుతమే. అయితే వెస్టిండిస్ మాజీ క్రికెటర్ శివనారాయణ్ చందర్‌పాల్ తన కుమారుడు త్యాగనారాయణ్ చందర్‌పాల్‌తో కలిసి గత కొన్నాళ్లుగా ప్రొఫెషనల్ క్రికెట్‌లో అలరిస్తున్న సంగతి తెలిసిందే.
కరీబియన్ దేశవాళీ క్రికెట్లో వీరిద్దరు గయానా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా జరుగుతున్న సూపర్ ఫిఫ్టీ టోర్నీలోని ఓ మ్యాచ్‌లో చందర్‌పాల్ చేతిలో అతని కొడుకు రనౌట్ కావడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు త్యాగనారాయణ్ రనౌట్ వల్ల మ్యాచ్ చేజారింది.
విన్‌వార్డ్ ఐలాండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో చందర్‌పాల్ కొట్టిన స్ట్రయిట్ డ్రైవ్‌ను బౌలర్ ఆపే ప్రయత్నంలో కాలు అడ్డపెట్టగా అది అతడి కాలిని తాకి వికెట్లను కూల్చింది. దీంతో నాన్ స్ట్రయికర్ త్యాగనారాయణ్ అప్పటికే క్రీజు వెలుపల ఉండటంతో త్యాగనారాయణ్ (12) పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.
అలా అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన రనౌట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.