Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'విశ్వాసం పెరిగే కొద్దీ... దూబె అత్యుత్తమ ఆల్‌రౌండర్‌‌గా ఎదుగుతాడు'

Shivam Dube will be better all-rounder as he gains more confidence: Bharat Arun


హైదరాబాద్: అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదిగే సామర్థ్యం యువ బౌలర్ శివమ్‌ దూబెకు ఉన్నాయని టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్ తెలిపాడు. టీమిండియా తరుపున మ్యాచ్‌లు ఆడేకొద్దీ అతడిలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుందని భరత్ అరుణ్ వెల్లడించాడు.

భరత్ అరుణ్ మాట్లాడుతూ "దూబె ఉత్తేజకరమైన ఆటగాడు. ప్రతి మ్యాచ్‌ నుంచి అతడు ఆత్మ విశ్వాసం పొందుతున్నాడని నేను భావిస్తున్నాను. ముంబై వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20లో తొలి ఓవర్‌ వేసిన తర్వాత అతడు పుంజుకున్న విధానం ప్రశంసించదగింది. కెప్టెన్ కోహ్లీ కూడా అతడిపై విశ్వాసం ఉంచాడు" అని అన్నాడు.

అతడిలో ఆత్మవిశ్వాసం పొందే కొద్దీ మంచి ఆల్‌రౌండర్‌ అవుతాడని భరత్ అరుణ్ చెప్పుకొచ్చాడు. మరోవైపు యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌పై కూడా అరుణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. "ఐపీఎల్‌లో దీపక్‌ అద్భుతంగా రాణించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేయగలడు. నెమ్మదైన బౌన్సర్లు, యార్కర్లు వేయగలడు" అని అన్నాడు.

"అంతర్జాతీయ స్థాయికి కావాల్సినవన్నీ అతడిలో ఉన్నాయి. జట్టు సమతూకం గురించి ఆలోచిస్తున్నాం. జడేజాను ఆల్‌రౌండర్‌గా ఉపయోగించుకోగలం. అవసరమైనప్పుడు కుల్దీప్‌, చాహల్‌ ఇద్దరినీ ఆడిస్తున్నాం" అని పేర్కొన్నాడు. ఆదివారం నుంచి విండిస్‌తో జరిగే మూడు వన్డేల సిరిస్‌లో కూడా భారత బౌలర్లు రాణిస్తాడని భరత్‌ తెలిపాడు.

"ఎక్కువ మంది బౌలర్లు రాణిస్తే జట్టుకు మంచిది. ఎంచుకోవడానికి ఎక్కువ వనరులు ఉంటాయి. చివరగా మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచిన చివరి రెండు మ్యాచ్‌ల్లో మన బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ప్రత్యర్ధి జట్టుని తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో సఫలమయ్యారు. విండిస్ సైతం గట్టి పోటీ ఇచ్చింది" అని అన్నాడు.

"న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వాతావరణం, పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని బౌలర్లను తీసుకుంటాం. జడేజా రెడీమేడ్‌ ఆల్‌రౌండర్‌. వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌‌లో రాణించాడు. సుందర్‌ కచ్చితంగా వన్డేల్లోకి వస్తాడు. ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు" అని భరత్ అరుణ్ వెల్లడించాడు.

Story first published: Saturday, December 14, 2019, 13:54 [IST]
Other articles published on Dec 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+