నా ప్రదర్శనపై నమ్మకం ఉంది.. టీమిండియాకు ఆడుతానని ముందే ఊహించా!!

ముంబై: భారత జట్టుకి నేను ప్రాతినిధ్యం వహించాలని మా నాన్న కోరుకున్నారు. టీమిండియాకు ఆడుతానని ముందే ఊహించా అని ముంబై ఆల్‌రౌండర్ శివమ్ దూబే తెలిపాడు. ఐపీఎల్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు అని చెప్పాడు. గురువారం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమీటి బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20, టెస్టు సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వగా.. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.

భారత జట్టుకి ఆడాలని నాన్న కల:
దేశవాళీ క్రికెట్లో సత్తాచాటిన ఆటగాళ్లకు సెలక్షన్ కమిటీ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వెన్నుగాయంతో భాదపడుతూ ఇటీవలే సర్జరీ చేయించుకున్న హార్ధిక్ పాండ్యా స్థానంలో.. వెస్టిండీస్-ఎ, దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన సిరీసుల్లో రాణించిన శివమ్ దూబేను టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా దూబే మాట్లాడుతూ... 'బ్యాటింగ్ దూకుడగా చేయాలని, భారత జట్టుకి నేను ప్రాతినిధ్యం వహించాలని మా నాన్న కోరుకున్నారు. ఇప్పుడు అది సాధ్యమయింది. చాలా ఆనందంగా ఉంది' అని అన్నాడు.

టీమిండియాకు ఆడుతానని ముందే ఊహించా:
'నాకు హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉంది. దానిపై మరింత సాధన చేసా. పవర్ హిట్టింగ్ అంటే నాకు ఇష్టం. భారత జట్టులో చోటు సంపాదించడం ఆనందంగా ఉంది. జట్టుకు ఎంపిక అవుతానని ముందే ఊహించా. ఎందుకంటే.. నా ప్రదర్శనపై నాకు నమ్మకం ఉంది. క్రికెట్‌లో మెరుగవ్వడానికి మరింత సాధన చేస్తా. ఆల్‌రౌండర్‌గా 100శాతం ఏకాగ్రత, ఫిట్‌నెస్ నాకు అవసరం. ఆ దిశగా సలహాలు, సూచనలు తీసుకుంటా' అని శివమ్ దూబే పేర్కొన్నాడు.

కోహ్లీ అండగా నిలిచాడు:
'ముంబై అండర్-23 జట్టుకు ఎంపికవ్వనప్పుడు మా అన్నయ్య ఆర్థికంగా నాకు ఎంతో సపోర్ట్ చేశాడు. ఐపీఎల్‌లో కోహ్లీ అండగా నిలిచాడు. ఒత్తిడికి లోనైనా, ఏదైనా సమస్య తలెత్తినా.. కోహ్లీతో మాట్లాడేవాడిని. కోహ్లీ నా సమస్యను అర్థం చేసుకొని సాయం చేసేవాడు' అని దూబే చెప్పాడు. 2018లో బరోడాతో రంజీ మ్యాచ్‌లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది అందరిని ఆకర్షించాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.5 కోట్లు ఇచ్చి అతన్ని కొనుక్కుంది. వెస్టిండీస్-ఎ, దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన సిరీసుల్లో అద్భుతంగా రాణించడంతో జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications