Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రేమ గెలిచింది: మతాంతర వివాహం చేసుకున్న స్టార్ క్రికెటర్!

Shivam Dube Love Story: భారత స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తన ప్రేమను గెలిపించుకోవడం కోసం మతపరమైన కట్టుబాట్లను కూడా దాటారు. తనకు 6 ఏళ్లు పెద్దదైన ముస్లిం అమ్మాయితో ప్రేమలో పడి చాలా కాలం డేటింగ్ తర్వాత ఆమెనే పెళ్లి చేసుకున్నారు. శివమ్ దూబే హిందూ, ముస్లిం సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే తన ప్రేమను పొందడానికి శివమ్ దూబే ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు. వారి లవ్ స్టోరీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

శివమ్ దూబే-అంజమ్ ఖాన్ లవ్ స్టోరీ
"ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, ఈ సృష్టి మొత్తం వారిని కలపడానికి ప్రయత్నిస్తుంది" అనే సినీ డైలాగ్‌ను నిజం చేస్తూ సాగింది భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే ప్రేమకథ. ఈ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ తన కంటే 6 ఏళ్లు పెద్దదైన అంజమ్ ఖాన్ అనే ముస్లిం యువతిని ప్రేమించి, చివరికి ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. ఈ ప్రయాణం ఏ మాత్రం ఈజీగా సాగలేదు. ఎన్నో కష్టాలు ఎదురైనా ప్రేమను గెలిపించుకోవడానికి ఈ క్రికెటర్ మతం అనే అడ్డుగోడను దాటడానికి ఏ మాత్రం సంకోచించలేదు.

Shivam Dube Interfaith Love Story Marriage With Anjum Khan and Their Inspiring Journey

6 ఏళ్లు పెద్ద ముస్లిం యువతితో ప్రేమ
శివమ్ దూబే ప్రస్తుతం తన భార్య అయిన అంజమ్ ఖాన్‌ను ఎంతగానో ప్రేమించారు. వీరిద్దరి మధ్య వయస్సులో ఆరేళ్ల తేడా ఉంది. అంటే శివమ్ దూబే కంటే అంజమ్ ఖాన్ 6 ఏళ్లు పెద్దది. ఓ స్నేహితుడి ద్వారా వీరిద్దరి తొలి పరిచయం జరిగింది. 2021లో వివాహం చేసుకునే ముందు వీరిద్దరూ కొంతకాలం పాటు తమ బంధాన్ని గోప్యంగా ఉంచుతూ డేటింగ్ చేశారు. అయితే శివమ్ దూబే అంజమ్ ఖాన్‌తో తన సంబంధాన్ని బయటకు చెప్పేసి పెళ్లి చేసుకున్న సమయంలో వారికి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదురైంది.

కుటుంబాల అంగీకారం కోసం తంటాలు
వారి ప్రేమ బంధాన్ని అంగీకరించడానికి ఇరువురి కుటుంబాలు మొదట అంగీకరించలేదు. దీనికి ప్రధాన కారణం వారి మతం. శివమ్ దూబే హిందూ కుటుంబానికి చెందినవారు కాగా.. అంజమ్ ఖాన్ ముస్లిం కుటుంబం నుంచి వచ్చారు. కానీ వారి ప్రేమకు ముందు వారి కుటుంబ సభ్యులు తలవంచక తప్పలేదు. దీంతో 2021లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. శివమ్ దూబే, అంజమ్ ఖాన్ ల పెళ్లి హిందూ, ముస్లిం సంప్రదాయాల ప్రకారం జరిగింది. ఈ జంట తమ వివాహ ఫోటోలను నెట్టింట పంచుకున్నారు.

ఇంతకు ఎవరీ అంజమ్ ఖాన్
అంజమ్ ఖాన్ సెప్టెంబర్ 2, 1986న ఉత్తరప్రదేశ్‌లో జన్మించారు. ఆమె అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో తన విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆమె నటన, మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆమె హిందీ సీరియల్స్, మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కనిపించారు. అలాగే ఆమె బాలీవుడ్ సినిమాలకు ప్రొఫెషనల్ వాయిస్-ఓవర్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేస్తున్నారు. అంజమ్ ఖాన్ సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటారు.

వారికి ఇద్దరు పిల్లలు
శివమ్ దూబే, అంజమ్ ఖాన్ ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు. పెళ్లయిన ఒక సంవత్సరం తర్వాత వారికి మొదటి సంతానంగా అయాన్ అనే బాబు జన్మించాడు. ఆ తరువాత 2025 జనవరిలో ఈ జంట రెండోసారి తల్లిదండ్రులయ్యారు. వారికి మహవిష్ అనే కుమార్తె జన్మించింది.

శివమ్ దూబే క్రికెట్ కెరీర్
శివమ్ దూబే ప్రస్తుతం భారత టీ20 అంతర్జాతీయ జట్టులో స్థిరంగా ఆడుతున్నాడు. 2019లో టీ20 ఫార్మాట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. ఆయన వన్డే అరంగేట్రం చేసినప్పటికీ 50 ఓవర్ల క్రికెట్‌లో ఎక్కువ అవకాశాలు రాలేదు. ఆయన 46 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 607 పరుగులు చేశారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా ఆడారు. ఆసియా కప్ 2025 గెలిచిన భారత జట్టులో కూడా సభ్యుడు. త్వరలో దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌లో కూడా శివమ్ దూబే ఆడనున్నాడు.

Story first published: Thursday, November 20, 2025, 11:26 [IST]
Other articles published on Nov 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+