ఓయ్ దూబే.. కాళ్లకు సంకెళ్లు వేసుకున్నావా? ఆ ఫుట్ వర్క్ ఏందీ? నువ్వు.. నీ జిడ్డు బ్యాటింగ్!

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్ జరుగుతుంది. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దూబే తన జిడ్డు బ్యాటింగ్‌తో అభిమానులను విసిగించాడు. ఓపెనర్లు జోస్ బట్లర్(41), యశస్వీ జైస్వాల్(32) అందించిన శుభారంభానికి కెప్టెన్ సంజూ శాంసన్(42) కూడా తోడవడంతో రాజస్థాన్ సులువుగా 200 ప్లస్ స్కోర్ చేస్తుందనుకున్నారు. కానీ మిడిల్ ఓవర్లలో దూబే డాట్ బాల్స్ ఎక్కువగా ఆడటంతో పాటు కెప్టెన్ సంజూశాంసన్‌కు స్ట్రైక్ ఇవ్వలేదు. 31 బంతులు ఆడిన దూబే కేవలం 35 పరుగులు మాత్రమే చేయడంతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న రాజస్థాన్ రాయల్స్ 171 పరుగులకే పరిమితమైంది. దాంతో దూబే‌పై రాజస్థాన్ ఫ్యాన్స్, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాళ్లకు సంకెళ్లు వేసుకున్నావా?

ముఖ్యంగా శివమ్ దూబే ఫుట్ వర్క్‌పై నెటిజన్లు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 35 బంతులాడిన దూబే తన ఫుట్‌‌వర్క్‌ను మాత్రం మార్చకుండా ఒకే రీతిలో ఆడాడు. ప్రతీ బంతిని ఒకే రీతిలో ఆడుతూ ఫోర్, సిక్స్ బాదాలనే తపనతో బంతులను వృథా చేశాడు. స్పిన్, పేస్ అనే తేడా లేకుండా ఆడాడు. దాంతో అతని ఫుట్ వర్క్‌పై నెటిజన్స్ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఆ కాళ్లకు సంకెళ్లు ఏమైనా వేసుకున్నావా? అని ఒకరంటే.. దూబే పాదం హనుమంతుడి పాదమని, దాన్ని ఎవరూ కదల్చలేరని మరొకరి సెటైర్ పేల్చారు. దానికి సంబంధించిన ఫన్నీమీమ్స్‌ను కూడా షేర్ చేస్తున్నారు.

ఎవడ్రా దూబేను పంపింది..

ఇక దూబేను ముందుగా బ్యాటింగ్ పంపించడంపై కూడా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, క్రిస్ మోరీస్, రాహుల్ తెవాటియా వంటి మంచి హిట్టర్లను కాదని దూబే‌ను ఎందుకు పంపించారని టీమ్‌మేనేజ్‌మెంట్ నిలదీస్తున్నారు. దూబేను ముందుకు పంపించోనిడికి బుద్ది ఉండాలని ఘాటుగా విమర్శిస్తున్నారు. టీమ్‌మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ చెత్త నిర్ణయమే జట్టు కొంప ముంచుతుందని కామెంట్ చేస్తున్నారు. దూబే.. విజయ్ శంకర్‌కు అన్నాలా ఉన్నాడని మరొకరు కామెంట్ చేస్తున్నారు. స్టువర్ట్ బిన్నీ అకాడమీ నుంచి వచ్చిన ఆటగాడని మరొకరు సెటైర్ పేల్చారు.

ఇండియాకు ఎలా ఆడాడురా అయ్యా?

అసలు ఫుట్ వర్క్ ఏమాత్రం బాలేని దూబే‌ను భారత జట్టుకు ఎలా సెలెక్ట్ చేశారని ఓ అభిమాని ప్రశ్నించగా.. బెర్ముడా ట్రయంగిల్ రహస్యం, దూబే ఇండియాకు ఆడటం అంతుపట్టని అంశాలని మరొకరు ట్వీట్ చేశారు. ఇక శివమ్ దూబేను కావాలనే ముంబై ఇండియన్స్ తర్వగా ఔట్ చేయలేదని, అది తమ ప్రణాళికలో భాగమని మరొకరు కామెంట్ చేసారు. వారి ప్లానింగ్ సూపర్ అంటూ కొనియాడుతున్నారు. దూబే జిడ్డూ బ్యాటింగ్ కారణంగా రాజస్థాన్ 20 పరుగులు తక్కువ చేసిందని, అది ముంబైకి కలిసొచ్చే అంశమని పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దూబేకే ఇవ్వాలని కోరుతున్నారు. ఇక దూబే జిడ్డూ బ్యాటింగ్ కారణంగా శాంసన్‌పై అనవసర ఒత్తిడి నెలకొందని, అది అతను ఔటయ్యేలా చేసిందని కామెంట్ చేస్తున్నారు.

నిన్న వార్నర్.. నేడు దూబే..

ఇక నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ను డేవిడ్ వార్నర్ ముంచితే.. నేడు రాజస్థాన్‌ రాయల్స్‌ను దూబే ముంచాడని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదే పిచ్‌పై చెన్నైతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 171 పరుగులే చేసి 7 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 55 బంతులాడిన వార్నర్ 57 పరుగులే చేశాడు. అతని స్లో బ్యాటింగ్ జట్టు భారీ స్కోర్ చేయకుండా చేసింది. ఇక నేడు విజయ్ శంకర్ కూడా అలానే ఆడటంతో ఫ్యాన్స్ ఈ ఇద్దర్నీ పోలుస్తూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, April 29, 2021, 18:36 [IST]
Other articles published on Apr 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X