ఆ చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్‌కు డబల్ బొనాంజా: ధోనీ సేనలో చోటు ఒక్కటే కాదు..

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్, 15వ ఎడిషన్ కోసం రెండోరోజు వేలం పాటు బెంగళూరు వేదికగా సాగుతోంది. ఈ వేలంపాటలో ఆల్‌రౌండర్ శివమ్ దుబేను చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇదివరకు అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కొనసాగాడు. ఈ సారి అతను ధోనీసేనలో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా శివమ్ దుబే డబుల్ బొనాంజా కొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్‌లో చోటు దక్కించుకోవడమే కాకుండా.. పండంటి బాబుకు తండ్రి అయ్యాడు.
శివమ్ దుబే భార్య అంజుం ఖాన్.. ఈ ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చారు. క్లౌడ్ నైన్ ఆసుపత్రిలో ఆమె ప్రసవించారు. ఈ విషయాన్ని దుబే తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. భార్య అంజుం ఖాన్, కుమారుడి ఫొటోను షేర్ చేశాడు. వారసుడు పుట్టాడనే ఆనందంలో ఉన్న శివమ్ కుటుంబం.. కొద్ది సేపటికే మరో గుడ్‌న్యూస్ అందుకుంది. శివమ్- సెకెండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్‌కు సెలెక్ట్ కావడం డబల్ హ్యాపీ ఇచ్చింది.
శివమ్ దుబే 2019లో ఐపీఎల్ టోర్నమెంట్‌లో అడుగుపెట్టాడు. ఐపీఎల్ కేరీర్‌లో ఇప్పటిదాకా 24 మ్యాచ్‌లల్లో 399 పరుగులు చేశాడు. 120 స్ట్రైక్‌రేట్‌ను రికార్డు చేశాడు. నాలుగు వికెట్లను పడగొట్టాడు. 2019లో 4 కోట్ల 40 లక్షల రూపాయలకు అతణ్ని రాయల్ ఛాలెంజర్స్ కొనుగోలు చేసింది. ఈ వేలంపాటలో అతణ్ని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. టీమిండియా తరఫున ఒక వన్డే, 13 టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఆడాడు. టీ20ల్లో హయ్యెస్ట్ స్కోర్ 59.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications