Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'వరల్డ్ కప్‌తో తిరిగొస్తున్న కుమారుడి కోసం ఆశగా ఎదురుచూస్తున్నా'

Shiva Singh mother speaks about under-19 world cup win

హైదరాబాద్: అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న తన కుమారుడు శివ సింగ్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానని అతని తల్లి తెలిపారు. న్యూజిలాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో పృథ్వీ షా నేతృత్వంలోని యువ భారత జట్టు వరల్డ్ కప్‌ని నెగ్గి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఫైనల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగియడానికి ముందే క్రికెటర్ల కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా టీమిండియా నాలుగోసారి అండర్-19 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ఎడమచేతి వాటం స్పిన్నర్ శివసింగ్ తల్లి వరల్డ్ కప్ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ 'నా కుమారుడు శివ సింగ్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను. మేజర్ టోర్నీకి వెళ్లేముందు.. అండర్-19 ప్రపంచ కప్‌తోనే తిరిగొస్తామని చెప్పాడు. చెప్పినట్లుగానే వరల్డ్ కప్ సాధించి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాడు' అని ఎంతో సంతోషంతో ఆమె చెప్పారు.

'శివ సింగ్ కఠోర శ్రమతో ఈ స్థాయికి వచ్చాడు. భారత జట్టులో చోటు దక్కించుకుని మంచి క్రికెటర్‌గా రాణించాలన్నదే తన కుమారుడి ధ్యేయం. టీమిండియా గర్వించేలా జట్టుకు తన సేవలు అందించాలని శివ సింగ్ తాపత్రాయ పడేవాడు' అని అన్నారు. కాగా, ఆసీస్‌తో జరిగిన ఫైనల్లో శివసింగ్ రెండు వికెట్లు తీశాడు.

ఫైనల్లో తొలుత ఇషాన్‌ పొరెల్ చెలరేగగా, ఆసీస్ మిడిల్, లోయర్ ఆర్డర్ క్రికెటర్లను శివ సింగ్‌, కమలేష్ నాగర్‌ కోటి, అనుకుల్‌ రాయ్‌లు పెవిలియన్‌కు చేర్చారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం 217 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 38.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.

ఓపెనర్ మన్‌జోత్‌ కల్రా (101, 102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులు)తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజా విజయంతో టీమిండియా నాలుగోసారి వరల్డ్ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. అంతకముందు 2000, 2008, 2012లలో టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది.

2000లో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో, 2008లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో, 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన యువ భారత్‌కు బీసీసీఐ భారీ నజరానాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 5, 2018, 10:56 [IST]
Other articles published on Feb 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+