Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shikhar Dhawan: తెల్ల పిల్ల పక్కన కూర్చుని మ్యాచ్‌ను ఆస్వాదించిన ధావన్.. ఆ మిస్టరీ గర్ల్ ఎవరు?

Shikhar Dhawan: ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ జట్టును టీమిండియా తన తొలి మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ బ్రాండ్ అంబాసిడర్‌గా శిఖర్ ధావన్ ఈ మ్యాచ్ ను ఆస్వాదించడానికి విచ్చేశాడు. ఇంతలో శిఖర్ ధావన్ స్టాండ్స్‌లో ఒక విదేశీ మహిళతో కూర్చుని కనిపించాడు. శిఖర్ ధావన్, ఆ విదేశీ మహిళ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. శిఖర్ ధావన్ ఆ మహిళతో ప్రేమలో పడ్డాడని కొందరు పేర్కొన్నారు.

శిఖర్ ధావన్‌తో కలిసి కనిపించిన ఆ మిస్టరీ గర్ల్ ఎవరు?
శిఖర్ ధావన్‌తో కలిపి ఆ మహిళను చూసిన జనాలు.. మళ్లీ శిఖర్ డేటింగ్ లో ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు. శిఖర్ ధావన్ విడాకులు తీసుకున్నందున ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కొంత కాలం క్రితం శిఖర్ ధావన్ ఎయిర్పోర్టులో ఓ విదేశీ మహిళతో కనిపించాడు. ఆ మహిళ పేరు సోఫీ అని తెలిసింది. శిఖర్ ధావన్ కూడా ఆమెను సోషల్ మీడియాలో ఫాలో చేస్తున్నాడు. అయితే డేటింగ్ వార్త ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.

Shikhar Dhawan Who Is the Mystery Girl Spotted with Him at the Match

గతంలో శిఖర్, ఆయేషా ప్రేమకథ ఇలా..
క్రికెటర్ శిఖర్ ధావన్, మాజీ కిక్ బాక్సర్ ఆయేషా ముఖర్జీల ప్రేమకథ ఫేస్‌బుక్‌లో కలయికతో ప్రారంభమైంది. ఆయేషా, శిఖర్ కంటే 10 ఏళ్లు పెద్దది. ఆయేషా ఆస్ట్రేలియా పౌరురాలు. ఫేస్ బుక్ లో ఆయేషా చిత్రాలను చూసిన శిఖర్ ధావన్ కు ఆమెపై మక్కువ ఏర్పడింది. శిఖర్ ఆమెకు అభ్యర్థన పంపాడు. అక్కడి నుంచి వారి ప్రేమకథ ప్రారంభమైంది. ఆయేషా తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆయేషా కు మొదటి వివాహం ద్వారా ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.

దీని తర్వాత కూడా శిఖర్ ధావన్, ఆయేషా ఇద్దరు ఒక్కటయ్యారు. 2009లోనే ఆయేషా గురించి ఇంట్లో వాళ్లతో గొడవపడి బయటకు వచ్చేసిన శిఖర్ ధావన్.. 2012లో ఆమెను పెళ్లాడాడు. ధావన్, ఆయేషాలు 2012లో సిక్కు సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో శిఖర్ ధావన్ భారత జట్టు తరపున అరంగేట్రం చేశాడు. పెళ్లి తర్వాత ఆయేషా ఇండియాలోనే నివసించింది.

డిసెంబర్ 2013లో ఆయేషా ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ఆ బాలుడి పేరు జొరావర్. ఆయేషా తన కొడుకుతో కలిసి భారత్ ఆడే మ్యాచ్ లలో కనిపించింది. ఆ తర్వాత శిఖర్ ధావన్, ఆయేషా గత సంవత్సరం విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వారు విడివిడిగా నివసిస్తున్నారు.

Story first published: Friday, February 21, 2025, 13:45 [IST]
Other articles published on Feb 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+