ఎక్కువ విశ్రాంతి: రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగియడంపై ధావన్

హైదరాబాద్: ఐదు రోజులు జరగాల్సిన టెస్టు మ్యాచ్ కేవలం రెండో రోజల్లోనే ముగియడంతో ఐర్లాండ్ పర్యటనకు ముందు టీమిండియాకి ఎక్కువ విశ్రాంతి లభించనుందని ఆ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ వెల్లడించాడు. బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే.
ఈ చారిత్రాత్మక టెస్టులో టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్‌లు సెంచరీలు నమోదు చేయగా, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలు హాఫ్ సెంచరీలు సాధించారు. ఆ తర్వాత బౌలింగ్‌లో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు చెలరేగడంతో అప్ఘనిస్థాన్ జట్టు 262 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
ఈ టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శిఖర్ ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అనంతరం ధావన్ మాట్లాడుతూ "క్రికెట్‌లో ఆప్ఘనిస్థాన్ ఈ స్థాయికి వచ్చినందుకు నేను అభినందిస్తున్నా. ఆ జట్టు తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ప్రత్యర్థి జట్టుతో ఆడి ఓసారి ఆప్ఘనిస్థాన్ విజయం సాధిస్తే చాలు" అని అన్నాడు.
"తద్వారా ఆప్ఘనిస్థాన్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పటికే భారత జట్టుతో టెస్టు ఆడటం ఆ జట్టులో కచ్చితంగా ఉత్సాహం నింపేదే. మ్యాచ్‌ని చూసేందుకు వచ్చిన అభిమానులకి ధన్యవాదాలు. ఇక మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడంతో ఐర్లాండ్ పర్యటనకు ముందు భారత జట్టుకి ఎక్కువ విశ్రాంతి లభించనుంది" అని ధావన్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications