
హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. సోమవారం ముంబైలో జరిగిన సియెట్ అవార్డుల కార్యక్రమంలో శిఖర్ ధావన్ పాల్గొన్నాడు.
2017లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. పాక్ చేతిలో ఓటమిని ప్రతి ఒక్క భారత ఆటగాడు తట్టుకోలేకపోతున్నాడని, ఈ వరల్డ్ కప్‌లో పాక్‌ని చిత్తుగా ఓడిస్తామని తెలిపాడు.
ఈ సందర్భంగా శిఖర్ ధావన్ మాట్లాడుతూ 'ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు మమ్మల్ని ఓడించింది. వరల్డ్ కప్‌లో పాక్‌ని ఓడించి ప్రతీకారాన్ని తీర్చుకుంటాం. వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది' అని అన్నాడు.
వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్‌లో టీమిండియాలో ధోని పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతోందని ధావన్ వెల్లడించాడు. 'ధోని తిరిగి తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకున్నాడు. ఇది జట్టుకు ఎంతో లాభిస్తుంది. ముఖ్యంగా వరల్డ్ కప్‌లో ధోని కీలకపాత్ర పోషించనున్నాడు' అని ధావన్ చెప్పాడు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథ్యం వహించిన మహేంద్ర సింగ్ ధోని టోర్నీ అసాంతం అధ్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ 11వ సీజన్‌లో మొత్తం 11 మ్యాచ్‌లాడిన ధోని 455 పరుగులు నమోదు చేశాడు. అంతేకాదు రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై జట్టుని ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలబెట్టాడు.
గత ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. షేన్ వాట్సన్ అజేయ సెంచరీతో(117 నాటౌట్)తో చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు.