ఢిల్లీ ఓటమి బాధించింది: మ్యాచ్ అనంతరం శిఖర్ ధావన్

హైదరాబాద్: ఢిల్లీ ఓటమి ఒకింత బాధకలిగించిందని ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి హైదరాబాద్-ఢిల్లీ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆప్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు మొత్తంగా తొమ్మిదో విజయం కాగా, వరుసగా ఆరో విజయం కావడం విశేషం. తాజా ఓటమితో ఢిల్లీ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన మొదటి జట్టయింది. ఈ మ్యాచ్‌లో 50 బంతుల్లో 92 పరుగులు చేసిన ధావన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.

మ్యాచ్ అనంతరం ధావన్ మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం శిఖర్ ధావన్ మాట్లాడుతూ గాయం నుంచి కోలుకున్న తర్వాత పరుగులు రాబట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, గురువారంనాటి మ్యాచ్‌తో తిరిగి పుంజుకున్నానని చెప్పాడు. అద్భుత ప్రదర్శన చేశారు, గబ్బర్ ఈజ్ బ్యాక్ అనుకోవచ్చా అని కామంటేటర్ అడిగిన ప్రశ్నకు ధావన్ తనదైన శైలిలో స్పందించాడు.

గబ్బర్ ఈస్ ఆల్వేస్
'తిరిగిరావడం కాదు.. గబ్బర్ ఈస్ ఆల్వేస్' అని చమత్కరించాడు. తన స్టైల్‌లో తాను ఆడటం జరిగిందని, కేన్ విలియమ్సన్ తన శైలిలో ఆడాడని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. 'బ్యాటింగ్‌కు దిగే ముందు కోచ్ మూడీ ఒక్కటే అన్నాడు. అన్ని పరుగులు వాళ్లు(ఢిల్లీ) సాధించగాలేనిది మనం సాధించలేమా? అని' అని ధావన్ అన్నాడు.

వ్యూహాలేవీలేకుండా సహజశైలిలో ముందుకెళ్లాం
దీంతో ప్రత్యేకమైన వ్యూహాలేవీలేకుండా మా సహజశైలిలో ముందుకెళ్లామని, ఇన్నింగ్స్ మధ్యలో కేన్, తాను పెద్దగా మాట్లాడుకున్నది కూడా లేదని ధావన్ వివరించాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌పై కూడా శిఖర్ ధావన్ స్పందించాడు. 'రిషబ్ పంత్ లాంటి యువ ఆటగాడు అద్భుతంగా ఆడటం చాలా బాగుంది. భారత క్రికెట్‌కు సంబంధించి కూడా ఇవి శుభపరిణామాలే' అని ధావన్ పేర్కొన్నాడు.

ఢిల్లీ ఓడిపోవడం ఒకింత బాధకలిగించింది
'సీనియర్స్‌తో గడిపే సమయం కుర్రాళ్లకు చాలా విలువైనది. రిషబ్ పంత్ చెలరేగి ఆడినా చివరికి ఢిల్లీ ఓడిపోవడం ఒకింత బాధకలిగించింది. బహుశా వాళ్లు ఇంకా ఎక్కువ పరుగులు చేయాల్సిందేమో' అని శిఖర్ ధావన్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ (106: 59 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సులు) ఆకాశమే హద్దుగా చెలరేగిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications