
హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ బుధవారం 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో గబ్బర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన శిఖర్ ధావన్ తన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై 187 పరుగులతో చెలరేగాడు.
ఈ మ్యాచ్‌లో 85 బంతుల్లోనే సెంచరీ చేసిన శిఖర్ ధావన్ అరంగేట్ర టెస్టులో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత వన్డే, టీ20 జట్లలోనూ తనదైన శైలిలో సత్తా చాటాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుని విజేతగా నిలపడంలో ధావన్‌దే కీలక పాత్ర. ఈ సిరిస్‌లో ధావన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ధావన్ ఇప్పటివరకూ భారత్ తరుపున 34 టెస్టులాడి 40.68 యావరేజితో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో 2,315 పరుగులు చేశాడు. 115 వన్డేలాడి 4,935 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 42 టీ20ల్లో 9 హాఫ్ సెంచరీలతో 1,232 పరుగులు చేశాడు.
గత ఐదేళ్లలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధావన్ అనేక రికార్డులను సృష్టించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో పేలవ ప్రదర్శన కనబర్చడంతో ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేసిన టీమిండియా టెస్ట్ జట్టులో చోటు కోల్పోయాడు. ధావన్ పుట్టినరోజుని పురస్కరించుకుని సోషల్ మీడియాలో పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.