చాహల్ టీవీలో ఇంటర్వ్యూ.. పంత్‌ను ట్రోల్ చేసిన ధావన్!!

రాజ్‌కోట్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే అనంతరం టీమిండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోన్న విషయం తెలిసిందే. తొలి వన్డేలో మొదటగా రాహుల్ (47) ఆకట్టుకున్నాడు. ఇక వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ చేస్తుండగా.. అతడి హెల్మెట్‌కు బంతి తగిలి గాయపడ్డాడు. దీంతో కంకషన్‌గా ప్లేయర్‌గా రాహుల్ వికెట్ కీపింగ్ చేసి మెప్పించాడు. రెండో వన్డేలో ఐదో స్థానంలో బరిలోకి దిగి అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.

కీపింగ్‌లోనూ అదరగొట్టిన రాహుల్
రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేకు పంత్ దూరమవ్వగా.. రాహుల్ మరోసారి కీపర్ బాధ్యతలు చేపట్టాడు. ఈసారి కూడా ఆకట్టుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను స్టంపౌట్ చేసిన రాహుల్.. ఆ తర్వాత రెండు క్యాచ్‌లు పట్టాడు. జట్టుకు అవసరమైన సమయంలో ఏ పాత్ర పోషించడానికైనా సిద్దపడిన రాహుల్ గట్స్‌కు హ్యాట్సాఫ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో పంత్‌ను ఓపెనర్ శిఖర్ ధావన్‌ను ట్రోల్ చేశాడు.
పంత్‌ను ట్రోల్ చేసిన ధావన్
మ్యాచ్ అనంతరం చాహల్ టీవీలో ధావన్, రాహుల్ సరదాగా మాట్లాడుకున్నారు. 'పంత్ నీ (రాహుల్) కీపింగ్ చూశాక అతడు కూడా నీలా ఫ్లిఫ్స్ వేయడానికి ప్రయత్నిస్తాడు. నీ వికెట్ కీపింగ్‌ను చూస్తే ఒక్క సారిగా పైకి లేచి, నేను బాగానే ఉన్నాను అని అంటాడు' అంటూ ధావన్ సరదాగా పేర్కొన్నాడు. దీంతో ఇద్దరి మధ్య నవ్వులు విరిసాయి. దీనికి సంబందించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో పోస్టు చేయగా వైరల్ అయింది.

కీపింగ్‌ను ఆస్వాదిస్తున్నా
అనంతరం రాహుల్ మాట్లాడుతూ... 'కుల్‌దీప్ యాదవ్, రవిందరా జడేజా బౌలింగ్‌లో బంతుల్ని అందుకోవడం కష్టంగా అనిపించింది. కుల్‌దీప్ వేసే బంతులు చాలా పైకి వచ్చాయి. వాటిని పట్టడం ఒక్కోసారి సవాలుగా మారింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇలాంటి బంతులెప్పుడూ రాలేదు. ప్రస్తుతం కీపింగ్‌ను ఆస్వాదిస్తున్నా. వీలైనంత మేర అత్యుత్తమంగా ఆడాలనే ప్రయత్నిస్తున్నా' అని చెప్పుకొచ్చాడు.

పంత్‌కు అవకాశం లేనట్లే
ఆదివారం జరిగే నిర్ణయాత్మకమైన మూడో వన్డేకు విన్నింగ్ టీమ్‌నే కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. ఇదే నిజమయితే తుది జతుత్లో పంత్‌కు అవకాశం లేనట్లే. అంతేకాకుండా పంత్, ధావన్, రోహిత్ గాయంపై కూడా బీసీసీఐ ఇప్పటివరకు స్పష్టతనివ్వలేదు. అయితే రోహిత్‌కు తగిలిన గాయం పెద్దదేమి కాదని చివరి వన్డేలో తప్పక ఆడతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. మరి తుది జట్టులో ఎవరు ఆడుతారో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications