Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నుపుర్‌తో భువీ పెళ్లి: ఆటపట్టించిన ధావన్, నెట్‌లో వీడియో వైరల్

Shikhar Dhawan teases groom-to-be Bhuvneshwar Kumar in a hilarious video - Watch

హైదరాబాద్: టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను ఓపెనర్ శిఖర్ ధావన్ ఆటపట్టించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భువనేశ్వర్ కుమార్ మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 23 (గురువారం) మీరట్‌లో తన ప్రేయసి నుపుర్‌ను పెళ్లాడబోతున్నాడు.

ఈ క్రమంలో ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. 'జట్టులో ఒకరైన భువనేశ్వర్‌ పెళ్లిచేసుకోబోతున్నాడు. భువి.. ఎలా ఫీలవుతున్నావు, ఎలా సిద్ధమవుతున్నావు' అని అడగ్గా భువీ కూడా నవ్వుతూ సమాధానమిచ్చాడు.

దీనిని తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ధావన్ 'భువి విష్యూ వెరీ హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌' అంటూ కామెంట్ పెట్టాడు. ఇదిలా ఉంటే అక్టోబరు 4న భువీ-నుపుర్‌ నిశ్చితార్థం జరిగింది. మరోవైపు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా చివరి రెండు టెస్టుల నుంచి భువీని బీసీసీఐ తప్పించింది.

మరోవైపు, వ్యక్తిగత కారణాల వల్ల ఓపెనర్ ధావన్‌ కూడా నవంబర్ 24 నుంచి శ్రీలంకతో నాగ్ పూర్ వేదికగా జరిగే రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. చివరి రెండు టెస్టులకు భువీ స్థానంలో తమిళనాడు ఆల్ రౌండర్ విజయ్‌ శంకర్‌కు చోటు కల్పించారు.

ఇదిలా ఉంటే కోల్‌కతా టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన భువనేశ్వర్ కుమార్ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును అందుకున్నాడు.

Story first published: Tuesday, November 21, 2017, 15:27 [IST]
Other articles published on Nov 21, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+