Shikhar Dhawan: అభిమానులు ముద్దుగా 'గబ్బర్' అని పిలుచుకునే శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి త్వరగా రిటైర్ అయ్యారు. అయితే ఇంత త్వరగా వీడ్కోలు చెప్పాల్సి వస్తుందని ధావన్‌కు కూడా తెలియదు. కెరీర్ ప్రారంభంలో శిఖర్ ధావన్ ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ 2013లో శిఖర్ ధావన్ కెరీర్‌లో కొత్త మలుపు వచ్చింది. ప్రపంచం శిఖర్ ధావన్‌ను గుర్తించింది. తన టెస్ట్ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాపై అద్భుతమైన సెంచరీ చేసి.. తాను చాలా కాలం పాటు టీమిండియా కోసం ఓపెనింగ్ చేయబోతున్నానని నిరూపించాడు. శిఖర్ ధావన్ చాలా కాలం పాటు టీమిండియాకు ఓపెనింగ్ బ్యాటర్ గా వ్యవహరించాడు. కానీ త్వరలోనే శిఖర్ ధావన్ కెరీర్ ముగిసింది. అయితే భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన ఆత్మకథ "ది వన్"ను ప్రకటించారు. తన ఆత్మకథ ప్రకటన సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో శిఖర్ ధావన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ త్వరగా ముగియడానికి కారణమైన ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరో శిఖర్ ధావన్ స్వయంగా ఇప్పుడు చెప్పుకొచ్చాడు.
శిఖర్ ధావన్ కెరీర్ ముగియడానికి కారణమైన ఆటగాళ్లు ఎవరు?
యువ ఆటగాడు ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసినప్పుడు తన కెరీర్ ముగియబోతుందని అర్థమైందని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. తనను జట్టు నుంచి తొలగించినప్పుడు ఎవరినీ సంప్రదించలేదని వెల్లడించాడు. జట్టు నుంచి తొలగించాక ఎవరికీ ఫోన్ చేయలేదని.. అయితే కొంతమంది సహచరులు మాట్లాడి మద్దతు ఇచ్చారన్నారు. అయినా దీని గురించి అస్సలు నిరాశపడలేదని.. దానిని ఆస్వాదిస్తున్నట్లు శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.

శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. "శుభ్‌మన్ గిల్ ఆ సమయంలో మూడు ఫార్మాట్లలో మంచి ప్రదర్శన చేస్తున్నాడు.అయితే నేను వన్డే జట్టులో మాత్రమే ఉన్నాను. అప్పుడు నా కెరీర్ ఎక్కువ కాలం కొనసాగదని నాకు అర్థమైంది." అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. వన్డే ఫార్మాట్ శిఖర్ ధావన్‌కు అత్యంత అద్భుతంగా ఉంది. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ 2015 వన్డే ప్రపంచ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేశాడు.
శిఖర్ ధావన్ అద్భుతమైన కెరీర్
శిఖర్ ధావన్ కెరీర్ చాలా అద్భుతంగా ఉంది. శిఖర్ ధావన్ టీమిండియా కోసం 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 34 టెస్ట్ మ్యాచ్‌ల 58 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేస్తూ ధావన్ 2315 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో ధావన్ 6793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20లలో శిఖర్ ధావన్ 1759 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి.