Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘నేను చాలా తిట్టాను..’: కోహ్లీతో గొడవపై శిఖర్ ధావన్ షాకింగ్ కామెంట్స్

Shikhar Dhawan and Virat Kohli: టీమిండియా తరఫున చాలా ఏళ్లు కలిసి ఆడిన విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ మధ్య మంచి స్నేహం ఉంది. స్టేడియం లోపల, బయట వారి స్నేహం కనిపిస్తూనే ఉంటుంది. అయితే తాజాగీ శిఖర్ ధావన్ విరాట్ కోహ్లీకి సంబంధించి ఒక పెద్ద రహస్యాన్ని వెల్లడించారు. ఓ సందర్భంలో కింగ్ కోహ్లీపై తనకు చాలా కోపం వచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు.

టీమిండియా కోసం మూడు ఫార్మాట్లలో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసిన శిఖర్ ధావన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన రిటైర్డ్ లీగ్‌లలో ఆడుతూ.. అప్పుడప్పుడు కామెంట్రీ కూడా ఇస్తున్నారు. ఢిల్లీ రంజీ జట్టు నుంచి టీమిండియా వరకు ఎన్నో ఏళ్లు విరాట్ కోహ్లీతో కలిసి ఆడిన శిఖర్ ధావన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీపై తనకు విపరీతమైన కోపం వచ్చిన క్షణాన్ని గుర్తు చేసుకున్నారు.

Shikhar Dhawan Shocking Revelation on Fight with Virat Kohli I Abused a Lot

విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ మధ్య గొడవలు
టీమిండియా ఆటగాళ్లు వార్మప్ కోసం ఫుట్‌బాల్ ఆడటం మామూలే. ఈ సమయంలో ఆటగాళ్ల మధ్య వాదోపవాదాలు కూడా జరుగుతుంటాయి. అలాంటి ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ రాజ్ షమానీ పోడ్‌కాస్ట్‌లో శిఖర్ ధావన్ మాట్లాడారు."మేము ఒకసారి ఫుట్‌బాల్ ఆడుతున్నప్పుడు గొడవ పడ్డాం. ఆ తర్వాత మేము వార్మప్‌లో ఫుట్‌బాల్ ఆడటం మానేశాం, ఎందుకంటే ఆటగాళ్లు పోట్లాడుకోవడం మొదలుపెట్టేవారు. అలా జరుగుతుంది, ఇంత మంది ఆటగాళ్లు, అందరిలో ఉత్సాహం ఉంటుంది, అందరూ గొప్ప ఆటగాళ్లే కదా" అని అన్నారు.

ఆ సంఘటనలో తాను విరాట్ కోహ్లీని తిట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ధావన్ ఇలా అన్నారు, "నాకు చాలా కోపం వచ్చింది. ఆ సంవత్సరం నాకు ఐపీఎల్ వేలం కూడా బాగా జరగలేదు. ఆ కోపం కూడా మనసులో ఉంది. ఆ సమయంలో వీడు (విరాట్) రనౌట్ అయ్యాడు. నేను డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా తిట్టాను. కానీ ఆ తిట్లు విరాట్‌ను ఉద్దేశించి కాదు, కోపంలో బ్యాటర్‌గా తిట్టుకున్నట్టుగా తిట్టాను. అయినా మా మధ్య మంచి అవగాహన ఉంది. అది ఉద్దేశపూర్వకంగా జరగదని మాకు తెలుసు. క్రికెట్‌లో ఇలాంటివి జరుగుతుంటాయి" అని ధావన్ చెప్పుకొచ్చారు.

విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ ఎలా మారింది?
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ విషయంలో తీసుకున్న పెద్ద మార్పును శిఖర్ ధావన్ చాలా దగ్గరగా చూశారు. ఆ మార్పు గురించి ధావన్ ఇంటర్వ్యూలో ఇలా అన్నారు: "నేను సీనియర్‌ను కావడంతో, అతను (కోహ్లీ) నాతో ఎక్కువ సమయం గడిపేవాడు. అతనికి తినడం అంటే చాలా ఇష్టం, కానీ మైదానంలో పరుగులు చేయాలనే ధ్యాస ఉండేది. తన బ్యాటింగ్‌పై అతనికి పూర్తి నమ్మకం ఉండేది." అయితే, ఒకరోజు విరాట్ అకస్మాత్తుగా తన ఫిట్‌నెస్‌ను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడని, అనుకున్నట్టుగానే దాన్ని చేసి చూపించాడని ధావన్ తెలిపారు.

Story first published: Thursday, October 2, 2025, 10:18 [IST]
Other articles published on Oct 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+