Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధావన్ క్వారంటైన్ లుక్.. కొత్తపేరు పెట్టిన హర్భజన్‌!!

Shikhar Dhawan Shares Quarantine Look, Gets A Nickname From Harbhajan Singh

ఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సమయాన్ని అందరిలానే టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. భార్య అయేషా, కొడుకు జొరావర్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియో, ఫొటోలు గబ్బర్ సోషల్‌మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంటున్నాడు.

క్వారంటైన్ లుక్:

క్వారంటైన్ లుక్:

తాజాగా శిఖర్ ధావన్‌ క్వారంటైన్‌లో సరికొత్త లుక్‌ ప్రయత్నించాడు. తలపాగా మాదిరిగా తన తలకు మఫ్లర్‌ చుట్టుకుని మీసాలు తిప్పుతూ ఫొటో దిగాడు. దానిని 'క్వారంటైన్ లుక్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి టీమిండియా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పందించాడు. 'బబ్బూ' అంటూ పేరు పెట్టాడు. దానికి గబ్బర్‌ 'ఓకే' అంటూ ఎమోజీలు పంపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు.

హింసకు నో చెప్పండి:

హింసకు నో చెప్పండి:

ఇటీవల శిఖర్ ధవన్ గృహహింసను అరికట్టాలంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. తన భార్య, కొడుకుతో కలిసి ఈ వీడియోని పోస్ట్ చేసిన ధవన్.. తన కుటుంబంతో కలిసి సరదగా గడుపుతున్న సమయంలో గృహహింస పెరిగిందనే వార్త విని మనస్సు విరిగిపోయిందని అన్నాడు. 'నేను ప్రేమించే కుటుంబంతో నా సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. ఈ రోజుల్లోనూ గృహ హింస జరుగుతోందని తెలిసి ఎంతో బాధపడుతున్నాను. మనం దీనికి ముగింపునివ్వాలి. ప్రేమ, దయాగుణం ఉన్న భాగస్వామ్యాన్ని ఎంచుకోండి. హింసకు నో చెప్పండి' అని ఓ వీడియో గబ్బర్ పేరొన్నాడు.

క‌రీనా క‌పూర్ ఇష్టం:

క‌రీనా క‌పూర్ ఇష్టం:

ఇటీవల శిఖర్‌ ధావన్‌ సహచర క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బాలీవుడ్‌లో ఇష్ట‌మైన న‌టీమ‌ణులు ఎవరని శ్రేయస్‌ అడగ్గా.. ప్రియాంక చోప్రా, క‌రీనా క‌పూర్ అని జవాబిచ్చాడు. బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇష్టమైన నటుడు అని ధావన్ తెలిపాడు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చూస్తానని, లాక్‌డౌన్‌ కారణంగా గతంలో చూడని సినిమాలు కొన్ని చూశా అని టీమిండియా ఓపెనర్ చెప్పుకొచ్చాడు.

దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా:

దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా:

చేతి వేలి గాయం కారణంగా 2019 వన్డే ప్రపంచకప్‌ నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేసిన ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (రాజ్‌కోట్ వన్డే) గాయపడ్డాడు. ప్రపంచకప్‌ నుంచి ధావన్ గాయపడడం నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కోలుకున్న గబ్బర్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా.. వర్షం, కరోనా కారణంగా మూడు వన్డేలు రద్దయ్యాయి.

Story first published: Monday, May 4, 2020, 21:59 [IST]
Other articles published on May 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+