Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ వీడియో.. చిందేసిన శిఖర్ ధావన్!!

Shikhar Dhawan Shares Adorable Video Of Him Dancing With Kids

ఢిల్లీ: టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ డాన్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలోవైరల్ అయింది. ఈ వీడియోను స్వయంగా ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఇందులో గబ్బర్ చిన్న పిల్లలతో కలిసి చిందేసాడు. పిల్లలు అందరూ కలిసి ధావన్‌తో స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. గబ్బర్ ఒక చిన్నారిని ఎత్తుకుని మరి డాన్స్ చేసాడు. ధావన్ తన వీడియోకు ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు.

'ప్రతి వ్యక్తిలోనూ ఒక చిన్నపిల్లాడు ఉంటాడు. ప్రపంచానికి ఆనందాన్ని పంచడానికి నేను ఎంతో ఇష్టపడతా. చిన్నారులు వాళ్ల స్వచ్ఛమైన మనస్సుతో డ్యాన్స్‌ చేయడాన్ని ఎంతో ఆస్వాదించా. చాలా ఆనందంగా ఉంది' అని గబ్బర్ పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన 20 నిమిషాల్లోనే 20,000 మంది చూశారు. అభిమానులు వీడియోపై లైక్‌లు, కామెంట్లు చేస్తున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ధావన్ చివరిసారిగా ఆడాడు.

మోకాలి గాయంతో విండీస్ పర్యటనకు దూరమయిన ధావన్‌.. వచ్చే ఏడాది జనవరిలో జరిగే శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌లకు ఎంపికయ్యాడు. పెద్దగా ఫామ్‌లో లేని గబ్బర్ శ్రీలంక టీ20 సిరీస్‌తో తిరిగిగాడిలో పడాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటోంది. రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్‌కు తోడు ధావన్ కూడా చెలరేగితే సిరీస్ సునాయాసంగా గెలవొచ్చు.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జనవరి 5న శ్రీలంకతో భారత్‌ తొలి టీ20 మ్యాచ్‌ ఆడనుంది. అనంతరం 7, 10 తేదీల్లో రెండు టీ20లు జరగనున్నాయి. ఇక జనవరి 14, 17, 19 తేదీల్లో ఆస్ట్రేలియాతో 3 వన్డేల్లో భారత్‌ తలపడుతుంది. 34 ఏళ్ల ధావన్‌ భారత్‌ తరఫున ఇప్పటివరకు 34 టెస్టులు, 133 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 2,315 పరుగులు.. వన్డేల్లో 5,518 పరుగులు.. టీ20ల్లో 1,504 పరుగులు చేశాడు.

Story first published: Tuesday, December 24, 2019, 15:08 [IST]
Other articles published on Dec 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+