Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైర‌ల్ వీడియో.. కొడుకుతో ధావన్ 'డాడీ కూల్' డ్యాన్స్!!

Shikhar Dhawan shakes leg with son Zoravar on popular Bollywood song

ఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) కారణంగా క్రీడాలోకం మొత్తం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా క్రీడా టోర్నీలు ర‌ద్దు, వాయిదా ప‌డ‌డంతో క్రీడాకారులంద‌రూ ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఇక లాక్‌డౌన్‌ కారణంగా తమ ఇంటి సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. అయితే ఇంట్లో తాము చేసే పనులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తన కొడుకుతో డాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

కొడుకుతో ధావన్ 'డాడీ కూల్' డ్యాన్స్:

కొడుకుతో ధావన్ 'డాడీ కూల్' డ్యాన్స్:

లాక్‌డౌన్‌ స‌మ‌యాన్ని శిఖ‌ర్ ధావన్‌ బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. మండు వేస‌విలో కూల్ కూల్ అంటూ కొడుకుతో స‌ర‌దా స‌మ‌యాన్ని గ‌డుపుతున్నాడు. ధావన్ త‌న కొడుకు జోరవర్‌తో కలిసి పాపుల‌ర్ బాలీవుడ్ సాంగ్ 'డాడీ కూల్ కూల్' పాట‌కు డ్యాన్స్ చేశాడు. స్టార్ ఓపెనర్ స్లైలిష్ గాగుల్స్ పెట్టుకుని జోరవర్‌తో డ్యాన్స్ స్టెప్పు లేసి అద‌రగొట్టాడు. మరోవైపు జోరవర్‌ కూడా గబ్బర్‌ను మించేలా చేసాడు. తండ్రిలాగే జోరవర్‌ కూడా స్టయిలిష్ హెయిర్ కట్‌తో కనిపించాడు. ధావన్ తన భార్య అయేషాతో కూడా డాన్స్ చేసాడు.

అయ్యర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌:

అయ్యర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌:

ఇటీవలే శిఖర్‌ ధావన్‌ సహచర క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో ఇష్ట‌మైన న‌టీమ‌ణులు ఎవరని అడగ్గా.. ప్రియాంక చోప్రా, క‌రీనా క‌పూర్ అని జవాబిచ్చాడు. బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇష్టమైన నటుడు అని ధావన్ తెలిపాడు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చూస్తానని, లాక్‌డౌన్‌ కారణంగా గతంలో చూడని సినిమాలు కొన్ని చూశా అని ఓపెనర్ చెప్పుకొచ్చాడు. కెరీర్‌లో దక్షిణాఫ్రికా స్పీడస్టర్‌ డేల్‌ స్టెయిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో చాలా ఇబ్బందులు పడ్డట్లు శిఖర్ ధావన్ తెలిపాడు.

దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా:

చేతి వేలి గాయం కారణంగా 2019 వన్డే ప్రపంచకప్‌ నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేసిన ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (రాజ్‌కోట్ వన్డే) గాయపడ్డాడు. ప్రపంచకప్‌ నుంచి ధావన్ గాయపడడం నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కోలుకున్న గబ్బర్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా.. వర్షం, కరోనా కారణంగా మూడు వన్డేలు రద్దయ్యాయి.

Story first published: Friday, April 17, 2020, 14:30 [IST]
Other articles published on Apr 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+