సినిమాల్లోకి శిఖర్ ధావన్.. ప్రముఖ బాలీవుడ్ బ్యానర్​లో అరంగేట్రం!

ముంబై: టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్.. సినీరంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. టీమిండియా స్టార్ ఓపెనర్‌గా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన గబ్బర్.. ఓ ప్రముఖ బాలీవుడ్ బ్యానర్ రూపొందిస్తున్న మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడట. ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయిందని ఓ ఫిల్మ్ వెబ్‌సైట్ పేర్కొంది. ఇది పూర్తి స్థాయి పాత్ర అని, గెస్ట్ రోల్​ కాదని తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ చిత్రం పేరు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇక గబ్బర్​ గతేడాది అక్టోబర్​లో అక్షయ్​ కుమార్​, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న రామసేతు సినిమా సెట్​లో కన్పించాడు. అయితే ధావన్ నటిస్తున్నది ఈ సినిమాలో కాదని సమాచారం. అక్షయ్​ కుమార్​, ధావన్ మంచి స్నేహితులు. సరదాగా షూటింగ్ చూసేందుకే ధావన్ రామసేతు సెట్​కి వెళ్లినట్లు తెలుస్తోంది.ఇక బాలీవుడ్ స్టార్​ హీరో రణ్​వీర్​ సింగ్​తోనూ ధావన్​కు సన్నిహిత సంబంధాలున్నాయి. గతేడాది డిసెంబర్​లో రణ్​వీర్​ను కలిసిన ఫొటోను శిఖర్ ధావన్ అభిమానులతో పంచుకున్నాడు. చాలా కాలం తర్వాత కలవడం ఆనందంగా ఉందన్నాడు. అప్పుడు విడుదలైన '83' సినిమా అద్భుతంగా ఉందని, సినిమా హిట్ అయినందుకు రణ్​వీర్​కు అభినందనలు కూడా తెలిపాడు.

ప్రస్తతం ఐపీఎల్ 2022 సీజన్​లో బిజిగా ఉన్న ధావన్ పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తున్నాడు. మైదానంలోనే కాదు సోషల్ మీడియాలనో ధావన్ చురుగ్గా ఉంటాడు. ఇన్​స్టాగ్రాంలో సరదా రీల్స్​తో అభిమానులను తరచూ అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వెండితెరపై తన నటనలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. మరి యాక్టర్​గా ధావన్​ ఏమేరకు రాణిస్తాడో చూడాలి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, May 17, 2022, 17:52 [IST]
Other articles published on May 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X