For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్.. ధావన్‌లు ఇక టెస్టు మ్యాచ్‌లు ఆడరా??

 Shikhar Dhawan set to be dropped, Rohit Sharma unlikely to be picked for West Indies Test series:

న్యూ ఢిల్లీ: సూపర్‌ ఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ల పేర్లు జాబితాలో లేకపోవడంతో కొంత నిరసన వ్యక్తమవుతోంది. అయితే ఇంతకు ముందులా వన్డే ఫార్మాట్‌లో ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుని సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎంపిక చేసే విధానాన్ని జాతీయ సెలెక్షన్‌ కమిటీ మార్చుకున్నట్లుగా అనిపిస్తోంది. 35 ఏళ్ల మురళీ విజయ్‌, 32 ఏళ్ల ధవన్‌లపై సెలెక్టర్లు కఠినంగా వ్యవహరించడంతో ఇక సుదీర్ఘ ఫార్మాట్‌కు వారు దూరమైనట్టేనని అనిపిస్తోంది.

విరివిగా అవకాశాలు ఉపయో గించుకోలేక

విరివిగా అవకాశాలు ఉపయో గించుకోలేక

భారత్‌ తరఫున 40 ఇన్నింగ్స్‌ల్లో 37.41 సగటుతో 1,459 పరుగులు సాధించింది. ఇందులో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీల భాగస్వామ్యాలున్నాయి. కుడి, ఎడమ చేతి వాటం ఆటగాళ్లు కావడంతో పాటు అనుభవం కూడా ఉండడంతో విరివిగా అవకాశాలు వచ్చినా వీరు ఉపయో గించుకోలేకపోయారు. ధావన్‌ 2014 ఇంగ్లండ్‌ టూర్‌లోనూ ఆరు ఇన్నింగ్స్‌ల్లో 122, అదే ఏడాది ఆసీస్‌పై 5 ఇన్నింగ్స్‌ల్లో 142 రన్స్‌ చేశాడు.

ధావన్‌లు ఇన్నింగ్స్‌ ఆరంభించినా

ధావన్‌లు ఇన్నింగ్స్‌ ఆరంభించినా

ఇదే ఏడాది జరిగిన సఫారీ టూర్‌లోనైతే రెండు ఇన్నింగ్స్‌ ల్లో 22 పరుగులు మాత్రమే సాధించాడు. విజయ్‌ ఈ ఏడాది ఆడిన ఆరు టెస్టుల్లో 21.1 సగటుతో 233 పరుగులే చేశాడు. మరో విషయమేమిటంటే.. బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌ విసిరే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌లపై ఈ జోడీ సగ టు 26.2 మాత్రమే. రాహుల్‌తో కలిసి విజయ్‌, ధావన్‌లు ఇన్నింగ్స్‌ ఆరంభించినా సగటులో పెద్దగా తేడా ఏమీ లేదు.

ఓపెనింగ్‌ స్లాట్‌ కోసం పోటీలో

ఓపెనింగ్‌ స్లాట్‌ కోసం పోటీలో

ఐదేళ్లుగా ముగ్గురు ఆటగాళ్లు ఓపెనింగ్‌ స్లాట్‌ కోసం పోటీలో ఉన్నారు. వీరితో పాటు గంభీర్‌, అభినవ్‌ ముకుంద్‌, పార్థివ్‌ పటేల్‌, పుజారా కూడా పలు సందర్భాల్లో ఓపెనింగ్‌ చేశారు. ఇలా ఎన్ని ఆప్షన్స్‌ ఉన్నా విదేశాల్లో భారత ఓపెనర్లు ఎప్పుడూ విజయవంతమైంది లేదు. దారుణమైన విషయమేమంటే తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం వచ్చి ఇప్పటికి ఎనిమిదేళ్లయింది. 2010లో దక్షిణాఫ్రికాలో గంభీర్‌, సెహ్వాగ్‌ల మధ్య చివరిసారి నమోదైంది.

మయాంక్‌, పృథ్వీ ఆటతీరుతో భవిష్యత్‌ జట్టు

మయాంక్‌, పృథ్వీ ఆటతీరుతో భవిష్యత్‌ జట్టు

మయాంక్‌, పృథ్వీపై ఆశలు: కేఎల్‌ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్‌కు మయాంక్‌, పృథ్వీలలో ఒకరు అరంగేట్రం చేయడం లాంఛనమే. ఇక ఆసీస్‌ టూర్‌కు కూడా భారత జట్టు రాహుల్‌తో పాటు అనుభవం లేని వీరిద్దరితో వెళ్లడం ఖాయమే కావచ్చు. కానీ మయాంక్‌, పృథ్వీ తమ ఆటతీరుతో భవిష్యత్‌ జట్టుపై ఆశలు రేపుతున్నారు. గత సీజన్‌లో అన్ని ఫార్మాట్లతో కలిపి మయాంక్‌ 2,141 రన్స్‌ చేశాడు. పృథ్వీ షా ఇప్పటికే భవిష్యత్‌ తారగా పేరు తెచ్చుకున్నాడు. 56.72 సగటుతో 14 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 1,418 రన్స్‌ సాధించాడు.

Story first published: Monday, October 1, 2018, 11:52 [IST]
Other articles published on Oct 1, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+