
ఆసక్తిగా ఎదురుచూస్తున్నా:
ఢిల్లీ క్యాపిటల్స్ పోస్ట్ చేసిన ఓ వీడియోలో శిఖర్ ధావన్ మాట్లాడుతో... 'మళ్లీ ఐపీఎల్ ఆడటం బాగుంది. జట్టులోనూ మంచి వాతావరణం నెలకొంది. జట్టులోని ఆటగాళ్లు దుబాయ్‌లో బాగా కష్టపడుతున్నారు. ఐపీఎల్ రెండో దశ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ మ్యాచ్‌లు జరగడం సంతోషం. రెండో దశలోనూ విజయంతోనే ఆరంబించాలనుకున్నాం. అదెంతో ముఖ్యం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తొలి మ్యాచ్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాం' అని తెలిపాడు.

ఈసారి కప్ కొడతాం:
'ఇప్పుడు మేము చేసే సాధనతో విజయాలు సాధించాలి. ఏప్రిల్‌లో ఈ సీజన్ మొదలైనప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ విజయపథంలో నడిచింది. మంచి విజయాలు అందుకున్నాము. అయితే టోర్నీ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఆ ఫ్లో మిస్ అయింది. ఇప్పుడు మళ్లీ అలాంటి విజయ ప్రస్థానం కొనసాగించాలి. ఈ క్రమంలోనే మేము కోల్పోయిన శక్తి సామర్థ్యాలు తిరిగి పొందాలనుకుంటున్నాం. కచ్చితంగా అప్పటి జోరును కొనసాగించి.. ఈసారి కప్ కొడతాం' అని శిఖర్ ధావన్ ధీమా వ్యక్తం చేశాడు. మిగిలిన సీజన్‌కు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రావడంతో తమ జట్టు మరింత బలపడిందని చెప్పాడు. దీంతో రాబోయే మ్యాచ్‌ల్లోనూ అద్భుతంగా ఆడతామని ధావన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

క్రిస్ వోక్స్ దూరం:
రిషబ్ పంత్ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2021 తొలి దశ మ్యాచ్‌లలో వరుస విజయాలు సాదించించింది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. పటిష్ట జట్లను సైతం ఓడించి ఔరా అనిపించింది. తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టినా.. పంత్ ఆకట్టుకున్నాడు. దీంతో గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చినా.. అతడికి కెప్టెన్సీ ఇవ్వలేదు. అయ్యర్ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. డీసీ జట్టు ఐపీఎల్ 2021 సెకెండ్ లెగ్ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 22న సన్‌రైజర్స్‌తో ఆడనుంది. అయితే ఐపీఎల్ 2021 ఆరంభానికి ముందు ఢిల్లీ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ స్టార్ ఆల్‌రౌండర్, ఇంగ్లండ్ ప్లేయర్ క్రిస్ వోక్స్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు.

ఒకవైపు సాధన చేస్తూ:
ఢిల్లీ ఆటగాళ్లు ఒకవైపు సాధన చేస్తూ.. మరోవైపు బాండింగ్ సెషన్‌లో పాల్గొంది. శుక్రవారం సాయంత్రం ప్రాక్టీస్ పూర్తయ్యాక ఢిల్లీ ప్రాంచైజీ రాత్రి ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. అక్కడ ఆటగాళ్లు ఆటలు, పాటలతో సందడి చేశారు. మొదటగా ప్లేయర్స్ అందరూ సైగలతో కూడిన ఓ గేమ్ ఆడారు. ఇందులో శ్రేయాస్ అయ్యర్ బృందం ఓడిపోగా.. అమిత్ మిశ్రా టీం గెలుపొందింది. ఆ తరువాత కొందరు ప్లేయర్స్ అందరూ హిందీ పాటలతో అలరించారు. చివరగా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'వాతి కమింగ్' పాటకు స్టెప్పులేస్తూ అయ్యర్ జట్టులో హుషారు నింపాడు.


Click it and Unblock the Notifications
