Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sri Lanka vs India: కెప్టెన్‌గా నా లక్ష్యం అదే: గబ్బర్

Shikhar Dhawan says Team India captaincy is a big achievement for me

కొలంబో: విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్‌లో ఉండగా.. శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత యువ జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. కొలంబో వేదికగా ఈ నెల 18 నుంచి శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ని టీమిండియా ఆడనుంది. దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్, కృష్ణప్ప గౌతమ్, చేతన్ సకారియా లాంటి యువ క్రికెటర్లు సత్తా నిరూపించుకునేందుకు ఇది మంచి అవకాశం. ఇదే విషయాన్ని టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.

గౌరవంగా భావిస్తున్నా

గౌరవంగా భావిస్తున్నా

ఈ నెల 18 నుంచి భారత్-శ్రీలంక జట్ల మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. శ్రీలంక సిరీస్‌కి ముందు స్టార్ స్పోర్ట్స్ షో 'ఫాలో ది బ్లూస్‌'లో శిఖర్ ధావన్ మాట్లాడుతూ... 'భారత జట్టుకి కెప్టెన్‌గా ఎంపికవడం పెద్ద గౌరవంగా భావిస్తున్నా. ఒక సారథిగా జట్టుని సమష్టిగా నడిపిస్తూ.. అందర్నీ సంతోషంగా ఉంచాలనుకుంటున్నా.

ఈ టూర్‌లో ఇదే నా లక్ష్యం. జట్టులో సరదాగా ఉండే కుర్రాళ్లున్నారు. అలానే మంచి సపోర్ట్ ఇచ్చే కోచింగ్ స్టాఫ్ ఉంది. చీఫ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌తో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. నేను రంజీల్లో ఆడేటప్పటి నుంచి ద్రవిడ్ నాకు తెలుసు. భారత్-ఎ జట్టుకి నేను కెప్టెన్‌గా ఆడినప్పుడు ద్రవిడ్ కోచ్‌గా ఉన్నాడు' అని అన్నాడు.

జులై 18న మొదటి వన్డే

జులై 18న మొదటి వన్డే

వాస్తవానికి ఈ నెల 13 నుంచే సిరీస్ ప్రారంభంకావాల్సి ఉంది. కానీ శ్రీలంక బ్యాటింగ్ కోచ్, డేటా అనలిస్ట్ ఇటీవల కరోనా వైరస్ బారినపడటంతో.. సిరీస్‌ని ఐదు రోజులు వాయిదా వేశారు. మూడు వన్డేలు వరుసగా జులై 18, 20, 23.. మూడు టీ20లు 25, 27, 29 తేదీల్లో జరుగనున్నాయి. మ్యాచ్‌ల ప్రారంభ సమయాల్లో స్వల్ప మార్పులు జరిగాయి.

ఇంతకుముందు షెడ్యూల్‌ ప్రకారం వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:30 గంటలకు.. టీ20లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కావాలి. ఇప్పుడు మధ్యాహ్నం 3, రాత్రి 8 గంటలకు మ్యాచులు స్టార్ అవ్వనున్నాయి.

WTC 2021-2023: రెండో ఎడిషన్‌ కోసం కొత్త పాయింట్ల ప‌ద్ధ‌తి.. షెడ్యూల్‌ ఇదే!!

హోటెల్లోనే క్వారంటైన్‌

హోటెల్లోనే క్వారంటైన్‌

శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత్ జట్టు జూన్ నెల చివర్లోనే కొలంబోకి చేరుకుని.. క్వారంటైన్‌ అయ్యారు. ఆ తర్వాత కొలంబో మైదానంలో ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది. అయితే లంక టీమ్‌లో వరుసగా కరోనా కేసులు నమోదవడంతో.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మళ్లీ భారత క్రికెటర్లని క్వారంటైన్‌లో ఉండమని శ్రీలంక క్రికెట్ బోర్డు ఆదేశించింది. శనివారం నుంచి ధావన్ సేన హోటెల్లోనే క్వారంటైన్‌ అయింది. లంక బోర్డు నుంచి తదుపరి ఆదేశాల వరకూ భారత ఆటగాళ్లు హోటల్ రూములకే పరిమితం కానున్నారు.

భారత జట్టు

భారత జట్టు

శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా.

Story first published: Wednesday, July 14, 2021, 16:08 [IST]
Other articles published on Jul 14, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+