జింబాబ్వేతో వన్డే సిరీస్.. ప్రపంచ క్రికెట్‌కు మంచిదన్న శిఖర్ ధావన్..! కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై స్పందిస్తూ..

కేఎల్ రాహుల్ నేతృత్వంలోని టీమిండియా గురువారం నుంచి జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. శిఖర్ ధావన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తొలుత ధావన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.. కానీ రాహుల్ ఫిట్ నెస్ సాధించి జట్టుకు అందుబాటులోకి రావడంతో అతన్ని బీసీసీఐ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ సిరీస్ ప్రారంభానికి రెండు రోజుల ముందు.. ధావన్ విలేకరుల సమావేశంలో ప్రసంగించాడు. ఇకపోతే ఈ సిరీస్‌కి ముందు వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో అతని స్థానంలో షాబాజ్ అహ్మద్ తుది జట్టులోకి ఎంపికైన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడుతుండగా సుందర్ భుజానికి గాయమైంది. దాంతో అతను తప్పుకోక తప్పలేదు.

ఇది శుభవార్త
'కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి రావడం, నాయకత్వం వహించడం శుభవార్త. అతను జట్టులోని ప్రధాన ఆటగాళ్ళలో ఒకడు. ఆసియా కప్ ముందుంది. కాబట్టి ఈ టైంలో అతను జట్టులోకి రావడం మంచిదైంది. ఈ సిరీస్ ద్వారా రాహుల్‌కు చాలా బెన్ ఫిట్ ఉంటుందని భావిస్తున్నా. వాషింగ్టన్ సుందర్ ఈ టూర్‌కు దూరమవ్వడం బాధాకరం. అయితే ఆటలో ఇవన్నీ భాగాలే. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను' అని ధావన్ అన్నాడు.

ఆ జట్టు ప్లేయర్లు మళ్లీ వెలుగులోకి వస్తున్నారు
'నేను అనుకుంటుందేంటంటే.. జింబాబ్వే ప్లేయర్లు మ్యాచ్‌లు గెలుస్తుండడంతో ఆ జట్టు ప్లేయర్లు మళ్లీ గుర్తించబడుతున్నారు. ప్లేయర్లు కూడా వెలుగులోకి వస్తున్నారు. ఇక ఆ జట్టులోని ప్రతి ప్లేయర్ కోసం మా జట్టు వద్ద ప్లాన్స్ ఉన్నాయి. నేను కూడా బాగా రాణించాలనుకుంటున్నాను. జట్టు కోసం ఉపయుక్తమయ్యే స్కోర్ చేయాలనుకుంటున్నా. నేను చాలా పాజిటివ్ మైండ్‌తో ఉన్నా. ఇది నాకు మంచి అవకాశం అని భావిస్తున్నా' అని ధావన్ చెప్పాడు.

ప్రపంచ క్రికెట్‌కు ఇది మంచిది
'జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా చాలా కాలంగా జింబాబ్వే కోసం ఆడుతున్నాడు. అతను చాలా నాణ్యమైన ఆటగాడు. మేము జింబాబ్వేతో ఆడటం ప్రపంచ క్రికెట్‌కు చాలా మంచిది. ఇది మాతో పాటు ఆ జట్టుకు కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే మా లాంటి క్వాలిటీ జట్టుతో ఆడటం వల్ల వాళ్లకు మంచి అనుభవం లభిస్తుంది. అలాగే మా జట్టులో ఉన్న యువకులను కూడా ఈ సిరీస్ నిలదొక్కుకోవడానికి అవకాశంలా ఉపయోగపడుతుంది.' అని ధావన్ తెలిపాడు.

వన్డేలు అందమైన ఫార్మాట్
వన్డేల గురించి ధావన్ మాట్లాడుతూ.. ఇది ఒక అందమైన ఫార్మాట్. ఈ ఫార్మాట్లో మీరు ఎప్పుడు ఎటాక్ చేయాలో, ఎప్పుడు డిఫెన్స్ చేయాలో తెలుసుకోవాలి. ఇది టీ20 లాగా హడావిడి ఫార్మాట్ కాదు. ఆటను అర్థం చేసుకుంటూ ఆడడం ఈ ఫార్మాట్లో ఉండే కీలకాంశం. ఈ ఫార్మాట్‌లో నేను రెగ్యులర్‌గా ఆడుతున్నాను. నాకు ఈ విషయం చాలా సంతోషంగా ఉంటుంది. జట్టులోని యువకులతో నా అనుభవాన్ని పంచుకోవడం కూడా నాకు ఆనందాన్నిస్తుంది. డంకన్ ఫ్లెచర్ భారత కోచ్‌గా ఉన్నప్పుడు నేను తొలిసారి 2014లో జింబాబ్వేకి వచ్చాను.' అని ధావన్ చెప్పాడు.

జింబాబ్వేతో మూడు వన్డేలకు ఎంపికైన భారత జట్టు:
కేఎల్ రాహుల్ ( కెప్టెన్ ), శిఖర్ ధావన్ ( వైస్ కెప్టెన్ ), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్ , కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, షాబాజ్ అహ్మద్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications