రాహుల్ బ్రో.. నువ్వు 12వ స్థానంలో కూడా సెంచరీ చేస్తావ్ : ధావన్

KL Rahul Can Score A Hundred Even As A 12th Man Says Shikhar Dhawan

హైదరాబాద్: టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన సహచర ఆటగాడైన కేఎల్ రాహల్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆఖరి వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రాహుల్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధావన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాహుల్‌ను కొనియాడాడు. ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ 12వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా సెంచరీ చేస్తాడని ప్రశంసించాడు.

క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని ఘటన.. క్రీడాస్పూర్తికి విరుద్దమంటూ మాజీల ఫైర్

'అద్భుతమైన ఆటతో అత్యద్భుతమైన సెంచరీ సాధించావ్ బ్రో.. ఇలానే నీ విధ్వంసాన్నికొనసాగించు.. నువ్వు ఇలానే ఆడితే 12వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా సెంచరీ సాధిస్తావ్'అనే క్యాప్షన్‌తో రాహుల్ సెంచరీ ఫోజ్ ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. నిజమే బ్రో.. రాహుల్ ఆర్డర్‌తో సంబంధం లేకుండా చెలరేగుతున్నాడని అభిమానులు ధావన్ కామెంట్‌తో ఏకీభవిస్తున్నారు.

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో బెంగళూరు వేదికగా జరిగిన డిసైడర్ మ్యాచ్‌లో ధావన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో న్యూజిలాండ్ టూర్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఇక ఐదు టీ20ల సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. వన్డే సిరీస్‌లో మాత్రం 0-3తో వైట్‌వాష్ అయింది.

అందుకే జడేజాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి : కపిల్‌దేవ్

ఈ రెండు సిరీస్‌ల్లో కీపింగ్, బ్యాటింగ్‌లో రాహుల్ అదరగొట్టాడు. టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకిదిగిన రాహుల్.. టాప్ స్కోరర్‌గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. ఇక మూడు వన్డేల సిరీస్‌లో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ తొలి వన్డేలో 88 పరుగులు చేశాడు. రెండో వన్డేలో విఫలమైనా.. మూడో వన్డేలో సెంచరీతో చెలరేగాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Wednesday, February 12, 2020, 19:40 [IST]
Other articles published on Feb 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X