For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shikhar Dhawan: పంజాబ్ నాకు రెండో ఇల్లు.. నా ర‌క్తంలోనే అది ఉంది.. అందుకోసం ఎదురుచూస్తున్నా!

Shikhar Dhawan says he is looking forward to playing in the Punjab Kings and that Punjab is his second home

ఐపీఎల్ 2022లో మ‌యాంక్ అగ‌ర్వాల్ కెప్టెన్సీకి తాను మద్ద‌తిస్తాన‌ని వెట‌ర‌న బ్యాట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ తెలిపాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా మ‌యాంక్ అగ‌ర్వాల్ నియ‌మితుడైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మయాంక్ అగ‌ర్వాల్ కెప్టెన్సీ గురించి శిఖ‌ర్ ధావ‌న్ స్పందించాడు. మ‌యాంక్ అగ‌ర్వాల్ గొప్ప ఆట‌గాడ‌ని కొనియాడిన శిఖ‌ర్ ధావ‌న్.. కెప్టెన్‌గా కూడా రాణిస్తాడ‌ని ఆత్మ‌విశ్వాసం వ్య‌క్తం చేశాడు. మ‌యాంక్ అగ‌ర్వాల్ ప‌రిణ‌తి చెందిన సీనియ‌ర్ ఆట‌గాడ‌ని చెప్పుకొచ్చాడు. అలాగే తాను మ‌యాంక్ అగ‌ర్వాల్‌తో సావాసాన్ని ఆనందిస్తాన‌ని, తామిద్ద‌రం త్వ‌ర‌గా క‌లిసి పోతామ‌ని ధావ‌న్ తెలిపాడు.

ఇక తాను పంజాబ్ కింగ్స్ త‌ర‌ఫున ఆడ‌డానికి ఉత్సాహంగా ఉన్నాన‌ని, పంజాబ్ త‌న‌కు రెండో ఇళ్లు లాంటిద‌ని అన్నాడు. తాను స‌రైన పంజాబీ వ్య‌క్తిన‌ని, త‌న ర‌క్తంలోనే పంజాబీ ఉంద‌ని ధావ‌ని తెలిపాడు. ఇక రానున్న ఐపీఎల్ సీజ‌న్ కోసం ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నాన‌ని, తాము క‌చ్చితంగా విజేతగా నిలుస్తామ‌ని ఆత్మ‌విశ్వాసం వ్య‌క్తం చేశాడు.

ఇక గ‌త సీజ‌న్లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌ఫున ఆడిన శిఖ‌ర్ ధావ‌న్, త‌న‌కు ఆ జ‌ట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పూర్తి మ‌ద్ద‌తు ఇచ్చాడ‌ని తెలిపాడు. ఈ సారి పంజాబ్ కింగ్స్ త‌ర‌ఫున ఆడ‌నున్న ధావ‌న్.. రికీ పాంటింగ్ సేవ‌ల‌ను కోల్పోతున్నాన‌ని గుర్తు చేసుకున్నాడు. పాంటింగ్ కింద ఆడ‌డాన్ని తాను ఆనందించాన‌ని, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో గొప్ప స‌మ‌యాన్ని గ‌డిపాన‌ని ధావ‌న్ చెప్పుకొచ్చాడు. 36 ఏళ్ల శిఖ‌ర్ ధావ‌న్ గ‌త మూడేళ్ల‌లో వ‌రుస‌గా 500కు పైగా ప‌రుగులు చేశాడు. అలాంటి ధావ‌న్‌ను పంజాబ్ కింగ్స్ మెగా వేలంలో 8 కోట్ల 25 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేసింది.

IPL Auction 2022: Shreyas Iyer To KKR For 12.25 Crore, Dhawan For Punjab | Oneindia Telugu

పంజాబ్ కింగ్స్ పూర్తి స్క్వాడ్ ఐపీఎల్ 2022
శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, రాజ్ అంగద్ బావా, షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, ఇషాన్ పోరెల్, సందీప్ శర్మ, ప్రేరక్ మన్కడ్, వైభవ్ అరోరా, రిరిక్ ఛటర్జీ, భల్తేజ్ ధండా, అన్ష్ పటేల్, నాథన్ ఎల్లిస్, అథర్వ టైడే, భానుక రాజపక్స, బెన్నీ హోవెల్

Story first published: Thursday, March 17, 2022, 16:51 [IST]
Other articles published on Mar 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+