న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20లకు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయరో నాకైతే అస్సలు తెలియదు.. శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Shikhar Dhawan Said that He didnt Know the Exact Reason for not Selecting for T20s

భారత జట్టు టీ20 ఫార్మాట్‌కు తాను ఎందుకు ఎంపిక కావట్లేదో తనకు తెలియదని భారత స్టాండ్ ఇన్ వన్డే కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. 2021లో శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టుకు ధావన్ కెప్టెన్‌గా, ప్లేయర్‌గా చివరి సారి ఆడాడు. ఆ తర్వాత అతను భారత టీ20 జట్టుకు ఎంపిక కాలేదు. ఇక ఆ విషయం గురించి తాను పెద్దగా ఆలోచించనని, వచ్చిన అవకాశాల్లో తన అత్యుత్తమ ప్రదర్శన ఎలా ఇవ్వాలనే దానిపైనే దృష్టి సారిస్తానని ధావన్ చెప్పాడు.

నా హ్యాండోవర్లో ఉండదు కదా

నా హ్యాండోవర్లో ఉండదు కదా

'నిజాయితీగా నన్ను ఎందుకు టీ20 టీంలోకి తీసుకోరో నాకు తెలియదు. బహుశా వాళ్ల దగ్గర ఏదైనా కారణం ఉండొచ్చు. అయినా నేను దాని గురించి లోతుగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవాలనుకోవడం లేదు. నేను చాలా కాలంగా భారత జట్టు టీ20 ఫార్మాట్లో ఆడలేదు.. నన్ను ఏ ఫార్మాట్లో ఎంపిక చేస్తారో కూడా నాకు తెలియదు.

నాకు లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే నా పని. అది ఐపీఎల్ అయినా.. దేశవాళీ క్రికెట్ అయినా లేదా టీమిండియా వన్డే జట్టు అయినా. చోటు దక్కినప్పుడు నేను బాగా రాణించాలనుకుంటా. అదొక్కటే నా చేతుల్లో ఉంది. మిగతదంతా నా హ్యాండోవర్లో ఉండదు కదా' అని ధావన్ పేర్కొన్నట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

ఒక్కసారి పుంజుకుంటే అడ్డే ఉండదు

ఒక్కసారి పుంజుకుంటే అడ్డే ఉండదు

వన్డే క్రికెట్‌లో అతని ప్రదర్శన, అలాగే వన్డే ఫార్మాట్ భవిష్యత్తు గురించి అతని వ్యూ గురించి అడిగిన ప్రశ్నకు ధావన్ స్పష్టమైన సమాధానాలిచ్చాడు. 50ఓవర్ల ఫార్మాట్ ఆటను ఇష్టపడుతున్నట్లు చెప్పాడు. 'నాకు వన్డే క్రికెట్‌ ఆడటం చాలా ఇష్టం. ఇది ఒక కళాత్మక ఫార్మాట్. టెస్టు, టీ20లకు వాటి విలువలున్నట్లే, వన్డే క్రికెట్ కూడా దానికంటూ ఓ ప్రత్యేక విలువ ఉంది. ఇది ఎంతో ఉత్తేజకరమైనది.

నాకు ఈ ఫార్మాట్ చాలా ఇష్టం' అని ధావన్ చెప్పాడు. విరాట్ కోహ్లీ గురించి.. అతని ఫామ్ గురించి అడిగినప్పుడు ధావన్ స్పందిస్తూ.. తిరిగి పుంజుకోవడానికి విరాట్ కేవలం ఒక ఇన్నింగ్స్ దూరంలో ఉన్నాడు. త్వరలోనే అతను పుంజుకుంటాడని ఆ తర్వాత అతడికి అడ్డుఅదుపు ఉండదని ధావన్ చెప్పాడు.

ఎవరికి వారే సెపరేటు..

ఎవరికి వారే సెపరేటు..

రవిశాస్త్రి, రాహుల్ ద్రావిడ్‌ ప్రధాన కోచ్‌లుగా వ్యవహరించిన టైంలో అతను టీమిండియాలో భాగంగా ఉంటున్నాడు. వీరిద్దరి మధ్య తేడా ఏమిటని ప్రశ్నించగా.. ఇద్దరి ఎనర్జీ పూర్తిగా భిన్నమైనదని ధావన్ చెప్పాడు. వీరిద్దరు ఎవరికి వారు సెపరేటు శైలి, యుక్తి కనబర్చుతారని చెప్పాడు.

రవి భాయ్ ఉంటే జట్టు వాతావరణం ఒకలా ఉంటుంది.. రాహుల్ భాయ్ ఉంటే మరోలా ఉంటుంది. నాకు రవి భాయ్‌తో గొప్ప అనుబంధం ఉంది. రాహుల్ భాయ్‌తో కూడా నా కెమిస్ట్రీ బానే ఉంది.. అతనితో కలిసి పనిచేయడం పట్ల సంతోషంగా ఉన్నాను అంటూ ధావన్ చెప్పాడు.

Story first published: Tuesday, August 9, 2022, 22:50 [IST]
Other articles published on Aug 9, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X