థ్యాంక్స్ టు ఫేస్‌బుక్: ధావన్‌తో ఎలా ప్రేమలో పడ్డానంటే!, ఆయేషా వెల్లడి


హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మైదానంలో బౌండరీలు, సిక్సర్లు బాదుతుంటే స్టాండ్స్‌లో నిలబడి అతడి భార్య ఆయేషా చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తుంటుంది. వీరిద్దరిదీ అద్భుతమైన జంట. నిజానికి ఆయేషా బాక్సింగ్ క్రీడాకారిణి. మొదటి భర్తకు విడాకులిచ్చింది. ఇద్దరు పిల్లల తల్లి. అయినప్పటికీ... ఆమెతో అసలు గబ్బర్ ఎలా ప్రేమలో పడ్డాడు?

క్రికెట్ అంటే పిచ్చి ఇష్టం
ఈ విషయాలన్నింటినీ ‘మిస్ ఫీల్డ్ ఎస్1ఈ1' అనే చాట్ షోలో ఆయేషా చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆయేషా మాట్లాడుతూ "ఫేస్‌బుక్‌లో చాలా మంది సీనియర్ క్రికెటర్లు నా స్నేహితులు. క్రికెట్ అంటే పిచ్చి ఇష్టం. క్రీడలన్నా ప్రాణం. నేను బాక్సింగ్ రింగ్‌లో ఉన్న చిత్రాన్ని ధావన్ చూశాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. ముందు నేను యాక్సెప్ట్ చేయలేదు" అని తెలిపింది.

ధావన్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసిన ఐదు నిమిషాల్లోనే
"నాకు ఉన్న క్రికెట్ స్నేహితులు చెప్పడంతో సరేనన్నా. ధావన్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసిన ఐదు నిమిషాల్లోనే అతడు ఛాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. నాకు అద్భుతమనిపించింది. ఓ సారి అలా మూడు గంటలు ఛాటింగ్ చేస్తూ విమానం ఎక్కడం మర్చిపోయాడు. అలా మేం దగ్గరయ్యాం" అని ఆయేషా చెప్పుకొచ్చింది.

టీవీలో శిఖర్ ధావన్ బ్యాటింగ్ చూస్తున్నా
"జొరావర్ సింగ్‌కు జన్మనిస్తున్నప్పుడు టీవీలో శిఖర్ ధావన్ బ్యాటింగ్ చూస్తున్నా. జొరావర్ పుట్టిన నాలుగు రోజులకు ధావన్ అతడిని చూశాడు. వెంటనే భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత నాలుగు నెలల వరకు అతడిని చూడలేకపోయాడు. నేను ఆస్ట్రేలియా వెళ్లాను. మైదానంలో అతడి ఆటను చూస్తూ చప్పట్లు కొట్టడమే అందరూ చూస్తారు" అని ఆమె తెలిపింది.

భోజనం చేసేందుకు ఆరు నెలలు ఎదురుచూశాం
"మేమిద్దరం సరదాగా విహారాలకు వెళ్తున్నామని అనుకుంటారు. మీకో విషయం తెలుసా. ఒక్కోసారి మేము ధావన్‌తో కలిసి భోజనం చేసేందుకు ఆరు నెలలు ఎదురుచూశాం. బయటవారికి ఒకవైపే తెలుసు" అని ఆయేషా వెల్లడించింది. ప్రస్తుతం శిఖర్ ధావన్ యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో ధావన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications