Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ వీడియో.. శిఖర్ ధావన్‌ను దంచికొట్టిన జొరావర్‌!!

Shikhar Dhawans Son Zoravar Motivates Him To Play In Most Unusual Way

ఢిల్లీ: మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ త్వరలో తిరిగి జట్టుతో కలవనున్నాడు. దేశవాళీ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీలో ధావన్ మోకాలికి గాయమైంది. శస్త్రచికిత్స కారణంగా దాదాపుగా 20 కుట్లు పడ్డాయి. దీంతో పది రోజులు నడవలేకపోయాడు. ఆ తర్వాత వర్కౌట్స్ చేసి ఫిట్‌నెస్‌ సాధించాడు. ఇక వచ్చే ఏడాది జనవరిలో జరిగే శ్రీలంక టీ20 సిరీస్‌, ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లకు ఎంపికయ్యాడు.

 ధావన్‌ను చితకబాదిన కొడుకు:

ధావన్‌ను చితకబాదిన కొడుకు:

సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే శిఖర్ ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. ఆ వీడియోలో ధావన్‌ను అతని కుమారుడు (జొరావర్‌) చితకబాదుతున్నాడు. ధావన్‌ పడుకొని ఉండగా.. జొరావర్‌ అతని తలపై తన్నుతున్నాడు. అంతేకాదు ధావన్‌పై పడి సరదాగా ఆడుకున్నాడు. అయితే తాను ఎక్కువ క్రికెట్‌ ఆడేందుకు తన కుమారుడే ప్రేరణగా నిలుస్తాడని ధావన్‌ అంటున్నాడు.

జొరావర్‌ కొడతాడు:

జొరావర్‌ కొడతాడు:

'నేను ఎక్కువ క్రికెట్‌ ఆడేందుకు నా హెడ్‌కోచ్‌ ప్రేరణనిస్తాడు. గబ్బర్‌కు ఇంకో చిన్న గబ్బర్‌ ఉన్నాడు. అతడు కొడతాడు. నా భార్య, కుమారుడు భారత్‌కు వస్తున్నారు. ఇక వారు నా వెంటే ఉంటారు. వారితో సమయం గడిపేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా' అని ధావన్‌ తెలిపాడు. ప్రస్తుతం ధావన్‌ భార్య అయేషా, కుమారుడు జొరావర్‌ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. 2020లో భారత్‌లో స్థిరపడేందుకు సిద్ధమవుతున్నారు.

క్లాస్‌ శాశ్వతం:

క్లాస్‌ శాశ్వతం:

'ఈ ఏడాదిని సరికొత్తగా ఆరంభిస్తాను. ఈ సంవత్సరం అంతా వేలి గాయం, కంటి గాయం, మోకాలి గాయం, మెడ నొప్పితో బాధపడ్డా. దాంతో పలు సిరీస్‌లకు దూరమయ్యా. జట్టుకు దూరమైనా బ్యాటింగ్‌ చేయడం నేనేమీ మర్చిపోలేదు. క్లాస్‌ అనేది శాశ్వతం. నేను పరుగులు సాధిస్తా. కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఇక నన్ను నేను నిరూపించుకోవాలి' అని ధావన్‌ అన్న సంగతి తెలిసిందే.

హార్భజన్ కామెంట్:

హార్భజన్ కామెంట్:

కుమారుడు జొరావర్‌తో గడిపిన వీడియోను ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకి భారత వెటరన్ స్పిన్నర్ హార్భజన్ సింగ్ ఎమోజీలతో కామెంట్ చేశాడు. రంజీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌తో జరుగనున్న మ్యాచ్‌కు ఢిల్లీ తరఫున ధావన్​ ఆడటానికి సిద్ధమయ్యాడు.

Story first published: Wednesday, December 25, 2019, 18:33 [IST]
Other articles published on Dec 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+