For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీసేన నెంబర్ వన్ ఎందుకంటే!: సీక్రెట్ చెప్పిన శిఖర్ ధావన్

జట్టులోని యువ ఆటగాళ్లు సైతం ఆత్మవిశ్వాసంతో రాణిస్తుండటంతో టీమిండియా అటు టెస్టుల్లోనూ, ఇటు వన్డేల్లోనూ నెంబర్ వన్ స్ధానాన్ని దక్కించుకుందని ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: జట్టులోని యువ ఆటగాళ్లు సైతం ఆత్మవిశ్వాసంతో రాణిస్తుండటంతో టీమిండియా అటు టెస్టుల్లోనూ, ఇటు వన్డేల్లోనూ నెంబర్ వన్ స్ధానాన్ని దక్కించుకుందని ఓపెనర్ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరిస్‌కు ఎంపికైన శిఖర్ ధావన్ తన భార్య అనారోగ్య కారణంగా సిరిస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

వన్డే సిరిస్ అనంతరం ఆస్ట్రేలియాతో శనివారం జరిగే మూడు టీ20ల సిరిస్‌కు సెలక్టర్లు ఎంపిక చేసిన 15 మంది జట్టు సభ్యుల్లో ధావన్ చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో ధావన్ ఎన్డీటీవీకి ఇంటర్యూ ఇచ్చాడు. అందులో ఐదు వన్డేల సిరిస్‌ను భారత్ 4-1తో కైవసం చేసుకోవడంపై స్పందించాడు.

టీమిండియా అగ్రస్ధానంలో నిలవడానికి ప్రధాన కారణం

టీమిండియా అగ్రస్ధానంలో నిలవడానికి ప్రధాన కారణం

'ప్రస్తుతం టీమిండియా అగ్రస్ధానంలో నిలవడానికి ప్రధాన కారణం జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు సైతం ఆత్మవిశ్వాసంతో రాణిస్తున్నారు. ఐపీఎల్‌ ద్వారా డ్రస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లు అందరూ అభిప్రాయాలను పంచుకోగలుగుతున్నారు. దీంతో మెరుగ్గా ఆడుతున్నాం' అని ధావన్ వివరించాడు.

మా అందరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ

మా అందరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ

'ముఖ్యంగా భారత జట్టు అద్భుత ప్రదర్శన చేయడానికి రిజర్వ్ బెంచ్ పాత్ర కూడా ఉంది. మా అందరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొని ఉంది. మెరుగైన ప్రదర్శనతోనే జట్టులో స్థానం దక్కుతుందని ప్రతి ఒక్క ఆటగాడికీ తెలుసు. అందుకే ఎవరికి వారు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరస్తున్నారు' అని ధావన్ పేర్కొన్నాడు.

దేశవాళీ క్రికెట్‌లో అన్ని సదుపాయాలు

దేశవాళీ క్రికెట్‌లో అన్ని సదుపాయాలు

'దేశవాళీ క్రికెట్‌లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండటంతో మనకు మంచి ఆటగాళ్లు లభిస్తున్నారు. ఫామ్‌ కోల్పోయి గతంలో టెస్టు, టీ20 సిరీస్‌కు దూరమయ్యాను. ఆ సమయం నాకెంతో కఠినమైనది. దీంతో వీలైనంత ఎక్కువ సమయాన్ని ప్రాక్టీస్ కోసం కేటాయించాను' అని ధావన్ తెలిపాడు.

ఫిట్‌నెస్‌ కోసం ఎంతో శ్రమించా

ఫిట్‌నెస్‌ కోసం ఎంతో శ్రమించా

'ఇక, ఫిట్‌నెస్‌ కోసం ఎంతో శ్రమించా. ఆ సమయంలో ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ ఎంతో సంతోషంగా ఆడా. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేశా. దేవుడి ఆశీర్వాదంతో ఎట్టకేలకు ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో చోటు దక్కింది. ఆ తర్వాత నిలకడగా ఆడుతూ జట్టులో చోటు సంపాదిస్తున్నాను' అని ధావన్‌ చెప్పాడు.

పాండ్యా బౌలింగ్‌పై శిఖర్ ధావన్

పాండ్యా బౌలింగ్‌పై శిఖర్ ధావన్

ప్రశ్న: How do you describe Hardik Pandya's bowling?

ధావన్ సమాధానం: Very good

ప్రశ్న: Pandya's batting?

ధావన్ సమాధానం: Hitter

ప్రశ్న: Bhuvi's (Bhuvneshwar Kumar) yorkers?

ధావన్ సమాధానం: Kanchebaaz (One who masters in the Marble game)

ప్రశ్న: Bumrah's (Jasprit) death bowling?

ధావన్ సమాధానం: Serious stuff

ప్రశ్న: Jadhav's bowling action?

ధావన్ సమాధానం: Phirki (flying disk)

ప్రశ్న: Any smart one-liners from MS Dhoni?

ధావన్ సమాధానం: When he sneezes, he says 'Bhagwan mujhe nahin isko uthaale' (God take him with you, not me)

ప్రశ్న: One exercise you would suggest to Yuzvendra Chahal so that he puts on the weight?

ధావన్ సమాధానం: Eating

ప్రశ్న: If you were to give an award for facial hair, who would you give it to?

ధావన్ సమాధానం: We all are very good at it, but still I would give that award to myself

ప్రశ్న: One word to describe for someone who has turned 38 (Ashish Nehra) and making a comeback at this stage?

ధావన్ సమాధానం: Determination, love towards the game and hard work.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+