ధావన్ తొడకొట్టడం వెనకున్న కథ, అసలు గబ్బర్‌గా ఎలా??

హైదరాబాద్: క్రికెట్‌లో భావోద్వేగంతో ఊగిపోయే క్రికెటర్లుంటారు. విజయోత్సాహంతో పలు రకాలుగా స్పందిస్తూ.. పలు రకాలుగా స్పందిస్తుంటారు. ఇలానే టీమిండియా క్రికెటర్ ఓపెనర్ శిఖర్ ధావన్ మైదానంలో వినూత్నంగా సంబరాలు చేసుకుంటూ అభిమానులను అలరిస్తుంటాడు. క్యాచ్ పట్టినా, విజయం దక్కినా.. తొడ కొడుతూ ధావన్ ఇచ్చే కబడ్డీ పోజ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ పోజ్‌నే తను ఎందుకొచ్చుకున్నాడో.. అసలు ఇది ఎలా అలవడిందో.. గబ్బర్ చెప్పుకొచ్చాడు.

బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్
గౌరవ్ కపూర్ ‘బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్' షోలో పాల్గొన్న ధావన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కబడ్డీ పోజ్‌పై స్పందిస్తూ.. ‘ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ నుంచి ఇది ప్రారంభమైంది. షేన్ వాట్సన్ క్యాచ్ పట్టుకున్న అనంతరం తొలి సారి ఈ పోజ్ ఇచ్చాను. కబడ్డీ ఆటను నేను ఆస్వాదిస్తాను. కబడ్డీ నాకు ఎంతో వినోదాన్ని ఇస్తుంది. నా హృదయం నుంచి వచ్చిన పోజ్ కావడంతో ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చింది. బౌండరీ లైన్ వద్ద నిలబడితే.. కబడ్డీ స్టైల్ పోజ్ ఇవ్వాలని అభిమానులు అడుగుతుంటారు.' అని గబ్బర్ చెప్పుకొచ్చాడు.

గబ్బర్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా
ఇదే షోలో తనకు గబ్బర్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా ధావన్ తెలియజేశాడు. గబ్బర్ అనే పేరు తన ఢిల్లీ జట్టు మాజీ కెప్టెన్ విజయ్ దాహియా పెట్టినట్లు ధావన్ పేర్కొన్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్న రోజుల్లో తాను ఎక్కువగా హిందీ బాలీవుడ్ విలన్ డైలాగ్‌లు చెప్పేవాడినని, దీంతో తనను గబ్బర్‌గా పిలవడం ప్రారంభించారని తెలిపాడు.

క్రికెట్ నుంచి దూరం కావాలనుకున్నానని కూడా
ఒక దశలో క్రికెట్ నుంచి దూరం కావాలనుకున్నానని కూడా చెప్పాడు. తన కెరీర్ ముగిసిందని, తన తండ్రి వ్యాపారాన్ని చూసుకుందామని నిర్ణయించుకున్న తరుణంతో తన కోచ్ మరో అవకాశం ఇచ్చాడని ధావన్ గుర్తు చేసుకున్నాడు. ఇక తన భార్య తన బలమని చెప్పుకొచ్చాడు.

మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలవడమే కాకుండా
ఆస్ట్రేలియాతో అరంగేట్ర టెస్టులో గబ్బర్ సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. 2013 చాంపియన్స్ ట్రోఫీ భారత్ నెగ్గడంలో ధావన్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీ అత్యధిక పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలవడమే కాకుండా గోల్డెన్ బ్యాట్‌ను సైతం అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications