Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కరీనా, ప్రియాంక ఇష్టం.. స్టెయిన్‌ అంటే మాత్రం..: ధావన్

Shikhar Dhawan reveals his favourite actress, toughest bowler, special knock in Instagram live session

ఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) కారణంగా క్రీడాలోకం మొత్తం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా క్రీడా టోర్నీలు ర‌ద్దు, వాయిదా ప‌డ‌డంతో క్రీడాకారులంద‌రూ ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఇక లాక్‌డౌన్‌ కారణంగా తమ ఇంటి సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. అయితే ఇంట్లో తాము చేసే పనులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సహచర క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

కరీనా, ప్రియాంక ఇష్టం:

కరీనా, ప్రియాంక ఇష్టం:

లైవ్‌ చాట్‌ సందర్భంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ అడిగిన ప్రశ్నలకు శిఖర్ ధావన్ తనదైన స్టయిల్లో సమాధానాలు ఇచ్చాడు. బాలీవుడ్‌లో ఇష్ట‌మైన న‌టీమ‌ణులు ఎవరని అడగ్గా.. ప్రియాంక చోప్రా, క‌రీనా క‌పూర్ అని జవాబిచ్చాడు. బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇష్టమైన నటుడు అని ధావన్ తెలిపాడు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చూస్తానని, లాక్‌డౌన్‌ కారణంగా గతంలో చూడని సినిమాలు కొన్ని చూశా అని ఓపెనర్ చెప్పుకొచ్చాడు.

స్టెయిన్‌ అత్యుత్తమ బౌలర్‌:

స్టెయిన్‌ అత్యుత్తమ బౌలర్‌:

కెరీర్‌లో దక్షిణాఫ్రికా స్పీడస్టర్‌ డేల్‌ స్టెయిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో చాలా ఇబ్బందులు పడ్డట్లు శిఖర్ ధావన్ తెలిపాడు. భారత్ తరఫున ఆడుతున్నప్పుడు, ఐపీఎల్‌లో స్టెయిన్‌ను ఎదుర్కోవడం కష్టంగా ఉండేది, స్టెయిన్‌ అత్యుత్తమ బౌలర్‌ అని పేర్కొన్నాడు. గ‌తేడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియాపై చేసిన శ‌త‌కం త‌న‌కు ప్ర‌త్యేక‌మైన‌ద‌ని.. ఆ స‌మ‌యంలో ధీరుడిన‌నే భావ‌న క‌లిగింది అని ధావన్ తెలిపాడు. చేతి గాయం బాధించినా జట్టు కోసం పోరాడి ఆడానని, సెంచరీ సాధించా కాబట్టి తన కెరీర్‌లో ప్రత్యేకమైన శతకంగా అది నిలుస్తుందన్నాడు.

లైవ్‌లో ఫ్లూట్‌ వాయించాడు:

లైవ్‌లో ఫ్లూట్‌ వాయించాడు:

సంగీతమంటే ఎంతో ఇష్టమని చెప్పడంతో అయ్యర్‌ కోరిక మేరకు లైవ్‌లో ఫ్లూట్‌ వాయించాడు. సంగీతమంటే ఇష్టమున్నవాళ్లు, ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకునేవారికి ఈ లాక్‌డౌన్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. ఈ క్రమంలో తాను కూడా ఫ్లూట్‌ నేర్చుకుంటున్నానని తెలిపాడు. ఇక లాక్‌డౌన్‌ సమయాన్ని పూర్తిగా కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తుట్లు ధావన్‌ చెప్పాడు. ధావన్ తన పాటలు, డ్యాన్స్‌లకు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే.

దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా:

దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా:

చేతి వేలి గాయం కారణంగా 2019 వన్డే ప్రపంచకప్‌ నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేసిన ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (రాజ్‌కోట్ వన్డే) గాయపడ్డాడు. ప్రపంచకప్‌ నుంచి ధావన్ గాయపడడం నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కోలుకున్న గబ్బర్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా.. వర్షం, కరోనా కారణంగా మూడు వన్డేలు రద్దయ్యాయి.

Story first published: Wednesday, April 15, 2020, 14:06 [IST]
Other articles published on Apr 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+