కరోనా భయం.. క్వారంటైన్‌లో శిఖర్ ధవన్!!

ఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్ గురించి ప్రపంచమంతా ఎంత చర్చ జరుగుతోందో అందరికి తెలిసిన విషయమే. కరోనాను ఇప్పుడు విస్మరించాల్సిన విషయం కాదు. ఈ వైరస్ సోకినట్లయితే ప్రాణానికే ప్రమాదం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ కారణంగా అన్ని దేశాల ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధించాయి. ఇతర దేశాల నుంచి వచ్చేవారు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించాయి. భారత కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా క్వారంటైన్ (నిర్బధం)కు వెళ్లాడు.

క్వారంటైన్‌లో ధావన్:
ఇటీవలే శిఖర్ ధావన్ జర్మనీకి వెళ్ళాడు. జర్మనీ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఢిల్లీకి చేరిన ధావన్ నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో చేరాడు. అలాగే అక్కడి పరిస్థితిని వివరిస్తూ మంగళవారం ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'ఢిల్లీకి 70 కి.మీ దూరంలోని ఓ భవనంలో అందరం 24 గంటల పర్యవేక్షణలో ఉన్నాం. మా అందరికి పరిశుభ్రమైన ఒక్కో గది కేటాయించారు. అలాగే ప్యాకేజ్‌డ్ వాటర్‌తో పాటు రుచికరమైన భోజనం, స్లిప్పర్స్ కూడా ఇచ్చారు. వైరస్ నియంత్రణ కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి' అని ధావన్ చెప్పుకొచ్చాడు.

క్వారంటైన్‌కు ఎందుకు:
ఇంగ్లాండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్, న్యూజిలాండ్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్, ఆసీస్ పేసర్ కేన్ రిచర్డ్‌సన్‌లకు కరోనా సోకిందని వార్తలు రాగా.. ఫెర్గూసన్, రిచర్డ్‌సన్‌లకు టెస్ట్ రిపోర్టులలో నెగటివ్ అని తేలింది. కాగా.. ఇంగ్లాండ్ క్రికెటర్‌కు కరోనా సోకినట్లు ఇంకా నిర్ధారణ కాలేదు. వైరస్ టెస్టుల అనంతరం పూర్తి సమాచారం తేలనుంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ధావన్.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు వెళ్ళాడు.

దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా:
చేతి వేలి గాయం కారణంగా 2019 వన్డే ప్రపంచకప్ నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేసిన ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (రాజ్‌కోట్ వన్డే) గాయపడ్డాడు. ప్రపంచకప్ నుంచి ధావన్ గాయపడడం నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కోలుకున్న గబ్బర్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా.. వర్షం, కరోనా కారణంగా మూడు వన్డేలు రద్దయ్యాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications