Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2025లో ఫైనల్‌కు చేరే జట్లు ఇవే: శిఖర్ ధావన్

IPL 2025: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ భారత్‌లో జరుగుతోంది. ఐపీఎల్ 2025లో భాగంగా ప్రతిరోజూ మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ లో ఫైనల్‌కు చేరుకోగల రెండు జట్లను శిఖర్ ధావన్ అంచనా వేశాడు. స్టార్ స్పోర్ట్స్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో ఐపీఎల్ 2025లో రెండు ఫైనలిస్ట్ జట్ల పేర్లను శిఖర్ ధావన్ అంచనా వేశాడు. ఈ సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఫైనలిస్టులుగా బరిలోకి దిగుతాయని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ అంచనా సరైనదో కాదో కాలమే చెబుతుంది. కానీ ప్రస్తుతానికి కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 18వ సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే పరాజయం పాలవ్వడం గమనార్హం. అయినా ఈ రెండు జట్లు ఫైనల్ కు చేరతాయని శిఖర్ ధావన్ చెప్పాడు.

Shikhar Dhawan predicts Kolkata Knight Riders and Mumbai Indians as the Finalists of IPL 2025
Take a Poll

డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బలమైన జట్టుగా కనిపించినప్పటికీ.. సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మరోవైపు ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆడింది. అక్కడ ముంబై ఇండియన్స్ జట్టు 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరిస్థితిలో ఈ రెండు బలమైన జట్లు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఎలా ఫైనల్ కి చేరుతాయనే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

Story first published: Tuesday, March 25, 2025, 16:27 [IST]
Other articles published on Mar 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+