న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హిట్టర్సే టార్గెట్‌గా.. నెట్స్‌లో తీవ్రమైన ప్రాక్టీస్

Indian Cricket Team Reached England and Started practice
Shikhar Dhawan practises to tackle short-pitched deliveries ahead of T20Is

హైదరాబాద్: భారత జట్టుకి ఇంగ్లాండ్ పర్యటన రూపంలో రేపటి నుంచి కఠిన సవాల్ ఎదురుకానుంది. ఇటీవల ఐర్లాండ్‌తో ముగిసిన రెండు టీ20 సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకున్న టీమిండియా.. మంగళవారం రాత్రి 10 గంటలకి ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌ని ఆడనుంది. గత ఇంగ్లాండ్ పర్యటనలో పేలవ ప్రదర్శన చేసిన టీమిండియా ఈసారి మాత్రం అద్భుత ప్రదర్శన చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటంతో తుది జట్టు ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం వెల్లడించాడు.

మంగళవారం నుంచి టీమిండియా ..ఇంగ్లాండ్‌తో

ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా మంగళవారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న పర్యటనపై దృష్టి సారించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 జరిగే మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ స్టేడియంలో కోహ్లి సేన నెట్ ప్రాక్టీస్‌కు సిద్ధమైంది.

ఓపెనర్ ధావన్ స్థానంలో రాహుల్‌:

ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ.. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తన సహచర ఆటగాళ్లు తొలి టీ20కి ఏవిధంగా సన్నద్ధమవుతున్నారో క్లుప్తంగా వివరించాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో చోటు దక్కించుకున్న రాహుల్‌ 36బంతుల్లో 70 పరుగులతో రాణించాడు.

ఆటగాళ్ల బలహీనతలపై దృష్టి సారించిన రవిశాస్త్రి:

భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో ఆటగాళ్ల బలహీనతలపై ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొన్ని సిరీస్‌లుగా షార్ట్ పిచ్ బంతుల్ని ఆడటంలో విఫలమవుతున్న శిఖర్ ధావన్‌కి ఎక్కువగా ఆ బంతుల్ని విసురుతూ ప్రాక్టీస్ చేయించిన కోచ్.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య‌ బౌలింగ్‌లో కూడా మార్పులు సూచించాడు.

రోహిత్ శర్మకి నెట్స్‌లో ఆఫ్ కటర్స్‌ని విసురుతూ హార్దిక్

ఇందులో భాగంగానే ఓపెనర్ రోహిత్ శర్మకి నెట్స్‌లో ఆఫ్ కటర్స్‌ని విసురుతూ హార్దిక్ కనిపించాడు. ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్ జేసన్ రాయ్, జోస్ బట్లర్, జానీ బారిస్టో లాంటి హిట్టర్స్ ఉన్న నేపథ్యంలో.. వారిని ఇబ్బందిపెట్టేలా బౌలింగ్‌ విభాగంతో కలిసి రవిశాస్త్రి ఎక్కువగా నెట్స్‌లో కనిపిస్తున్నారు.

Story first published: Tuesday, July 17, 2018, 16:59 [IST]
Other articles published on Jul 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X