
ఆలియా.. నిన్ను చాలా మిస్సవుతున్నా:
తాజాగా శిఖర్ ధావన్ తన కూతురు ఆలియా బర్త్‌డే సందర్భాన్ని పురస్కరించుకొని ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. తన కూతురు ఆలియాతో కలిసి గతంలో చేసిన డ్యాన్స్‌ను గబ్బర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 'హ్యపీ బర్త్‌డే మై ఏంజెల్. నీ జీవితంలో ఇలాంటి వేడుకలు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజటికంటే.. ఈ రోజు నేను నిన్ను చాలా మిస్సవుతున్నా తల్లీ. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పుట్టిన రోజును ఆనందంగా జరుపుకో' అని రాసుకొచ్చాడు.

ఐ లవ్ యూ సో మచ్ పప్పా:
శిఖర్ ధావన్ ట్వీట్‌పై ఆలియా స్పందించింది. 'థాంక్యూ నాన్న. ఈ వీడియో షేర్ చేసి..నాకు ఎప్పటికి గుర్తుంచుకునేలా చేశావు. ఐ లవ్ యూ సో మచ్ పప్పా. నేను కూడా నిన్ను చాలా మిస్సవుతున్నా' అంటూ పేర్కొంది. శిఖర్ ధావన్‌కు ఆలియా స్టెప్ డాటర్ అన్న సంగతి తెలిసిందే. ధావన్ భార్య అయేషాకు అంతకుముందే పెళ్లి కాగా.. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ధావన్‌తో పెళ్లి అనంతరం ఓ కుమారుడు జన్మించాడు.

సరికొత్త లుక్:
తాజాగా శిఖర్ ధావన్ క్వారంటైన్‌లో సరికొత్త లుక్ ప్రయత్నించాడు. తలపాగా మాదిరిగా తన తలకు మఫ్లర్ చుట్టుకుని మీసాలు తిప్పుతూ ఫొటో దిగాడు. దానిని 'క్వారంటైన్ లుక్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. 'బబ్బూ' అంటూ పేరు పెట్టాడు. దానికి గబ్బర్ 'ఓకే' అంటూ ఎమోజీలు పంపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు.

దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా:
చేతి వేలి గాయం కారణంగా 2019 వన్డే ప్రపంచకప్ నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేసిన ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (రాజ్‌కోట్ వన్డే) గాయపడ్డాడు. ప్రపంచకప్ నుంచి ధావన్ గాయపడడం నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కోలుకున్న గబ్బర్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా.. వర్షం, కరోనా కారణంగా మూడు వన్డేలు రద్దయ్యాయి.


Click it and Unblock the Notifications












