న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువరాజ్ ఛాలెంజ్‌.. గెలిచిన ధావన్‌

Shikhar Dhawan Picks Up Bat For The 1st Time After Finger Injury During World Cup || Oneindia Telugu
Shikhar Dhawan picks up bat for the 1st time after finger injury at World Cup over Yuvaraj Singh Challenge

చేతి వేలి గాయం కారణంగా ప్రపంచకప్‌ నుంచి అర్దంతరంగా తప్పుకున్న టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చాలా రోజుల తర్వాత మళ్లీ బ్యాట్‌ పట్టాడు. బ్యాట్ పట్టడమే కాదు మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ విసిరిన చాలెంజ్‌లో విజయం సాధించాడు. యువరాజ్‌ సింగ్‌ విసిరిన 'బాటిల్‌ క్యాప్ ఛాలెంజ్‌'ను గబ్బర్ స్వీకరించాడు.

ప్రపంచకప్‌ ఫైనల్.. ఐసీసీ నిబంధనలను మార్చుకోవాలిప్రపంచకప్‌ ఫైనల్.. ఐసీసీ నిబంధనలను మార్చుకోవాలి

తొలిసారి బ్యాట్ పట్టా:

చాలెంజ్‌లో భాగంగా గబ్బర్ తనదైన శైలిలో బ్యాటుతో బంతిని బాటిల్‌కు తగిలేలా ఆడి మూత కిందపడేలా చేశాడు. దీంతో యువీ విసిరిన ఛాలెంజ్‌ను గబ్బర్ గెలిచాడు. ఈ వీడియోను గబ్బర్ తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేశాడు. 'యువీ పాజీ.. ఇదిగో నా బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌. గాయపడ్డ తర్వాత తొలిసారి బ్యాట్ పట్టాను. ఈ ఫీలింగ్‌ చాలా బాగుంది' అని రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ చేస్తోంది. 'గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌' అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

సచిన్‌కు కూడా ఛాలెంజ్‌:

సచిన్‌కు కూడా ఛాలెంజ్‌:

సోషల్‌ మీడియాలో 'బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌' పాపులర్ అయింది. ఎంతోమంది ప్రముఖులు ఈ సవాల్‌లో పాల్గొంటున్నారు. కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సైతం బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌లో పాల్గొని ప్రశంసలు అందుకున్నాడు. యువీ ఈ బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ను కేవలం ధావన్‌కే కాకుండా.. బ్రియన్ లారా, క్రిస్‌గేల్‌, సచిన్‌ తెందుల్కర్‌లకు కూడా విసిరాడు. మరి వీరందరూ ఎప్పుడు స్వీకరిస్తారో చూడాలి.

వెస్టిండీస్‌ పర్యటనకు విశ్రాంతి:

వెస్టిండీస్‌ పర్యటనకు విశ్రాంతి:

ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా చేతి వేలికి గాయమైంది. అయినా కూడా బ్యాటింగ్ కొనసాగించి సెంచరీ చేసాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఐదారు వారాల సమయం పడుతుందని వైద్యులు తెలపడంతో మెగా టోర్నీ నుంచి ధావన్ నిష్క్రమించాడు. ఐసీసీ మెగా టోర్నీల్లో రెచ్చిపోయే ధావన్‌ ప్రపంచకప్‌లో లేకపోవడం టీమిండియాను దెబ్బతీసింది. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వెస్టిండీస్‌ పర్యటనకు కూడా ధావన్‌కు విశ్రాంతినివ్వనున్నారు.

Story first published: Friday, July 19, 2019, 8:35 [IST]
Other articles published on Jul 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X