Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెల్ఫీ కోసం వచ్చిన అభిమానితో ధావన్ అనుచిత ప్రవర్తన

Shikhar Dhawan Misbehaves with a Fan trying to take a selfie

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఓ అభిమానిపై తీవ్ర ఆగ్రహం ప్రదర్శించాడు. తనతో సెల్ఫీ దిగాలని వచ్చిన ఆ అభిమానిని ధావన్ పక్కకు నెట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అసలేం జరిగింది?
మూడు టెస్టుల సిరిస్‌లో భాగంగా చివరి టెస్టు కోసం టీమిండియా ఢిల్లీకి చేరుకుంది. స్ధానికుల ఆహ్వానం మేరకు ధావన్ ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ధావన్‌ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని గబ్బర్‌తో కరచాలనం చేయాలని, సెల్ఫీ దిగాలని ప్రయత్నించారు.

ధావన్‌ని అభిమానులు ముద్దుగా 'గబ్బర్' అని పిలిచే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ అభిమాని అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ధావన్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించగా ఆగ్రహానికి గురైన ధావన్ అతడిని పక్కకు తోసేశాడు. ఈ సన్నివేశాన్ని అక్కడున్న వారు తమ ఫోన్లతో చిత్రీకరించారు.

అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. నిజానికి శిఖర్ ధావన్ అభిమానులతో ఎప్పుడూ సరదాగా ఉంటాడు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఇలా ప్రవర్తించడంతో ఆ అభిమానిదే తప్పు అయి ఉంటుందని అంటున్నారు.

ఈ విషయంలో కొందరు ధావన్‌కు మద్దతుగా నిలవగా, మరికొందరు విమర్శిస్తున్నారు. భద్రతా సిబ్బందిని దాటి వచ్చి మరీ కోహ్లీ అభిమానులతో సెల్ఫీలు దిగుతుంటే ధావన్‌కు ఏమైందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య మూడో టెస్టు శనివారం (డిసెంబర్ 2)న ప్రారంభం కానుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 1, 2017, 9:31 [IST]
Other articles published on Dec 1, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+