ధావన్ టెస్టుల్లోకి మళ్లీ రానున్నాడా?

మెల్‌బోర్న్: పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఓపెనర్‌గా ఆడుతున్న శిఖర్ ధావన్‌ను భారత్ మళ్లీ టెస్టు జట్టులోకి తీసుకోనుందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీ20, వన్డే ఫార్మాట్‌లలో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న ధావన్.. టెస్టు ఫార్మాట్ కు సరిపోడంటూ అతణ్ని పక్కనపెట్టేశారు. దానికి కారణం. అతనికి ఇచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోకపోవడమే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పర్యటనలో యువ సంచలనం పృథ్వీ షాకు ఓపెనర్‌గా అవకాశమిచ్చారు. కానీ, అతను గాయం కారణంగా సిరీస్ కు దూరమైయ్యాడు.

పేలవంగా విఫలమవుతోన్న రాహుల్, విజయ్‌లు
ఈ క్రమంలో మురళీ విజయ్, కేఎల్ రాహుల్‌లు బరిలోకి దిగడం పేలవంగా అవుటవడం పరిపాటైపోయింది. వీరి ఎంపికపై కోహ్లీ ఒక్కడే విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. మిగిలిన వారంతా విముఖత చూపిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఒక స్థానంలో ధావన్ అయితే ఎలా ఉంటుందోనని పరిశీలిస్తున్నారట. ఈ క్రమంలో విదేశీ ఫాస్ట్ పిచ్‌లపై పేలవ ప్రదర్శనతో భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్‌పై మళ్లీ సెలక్టర్లు దృష్టిసారిస్తున్నట్లు సమాచారం.

హోటల్‌లో ఆటగాళ్లతో కలిసి కనిపిస్తుండటం
నిజానికి అతడికి టెస్టు జట్టులో చోటు లేదు. ఐతే టీ20 సిరీస్ ముగిశాక ధావన్.. స్వదేశానికి వెళ్లలేదు. టెస్టుల తర్వాత జరిగే వన్డే సిరీస్ కోసం ఇక్కడే ఉంటున్నాడు. తన భార్యది ఆస్ట్రేలియానే కావడంతో ఇక్కడే కుటుంబంతో కలిసి గడుపుతున్నాడు. అతను భారత జట్టు బస చేస్తున్న హోటల్‌లో ఆటగాళ్లతో కలిసి కనిపిస్తుండటం ఊహాగానాలకు తావిస్తోంది. ఒక వేళ మూడో టెస్టులో అవకాశం ఇవ్వకపోయినా.. ఆ మ్యాచ్‌లో విజయ్ విఫలమైతే చివరి టెస్టుకు అతడిని కచ్చితంగా ఎంపిక చేయొచ్చంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గతంలో టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన ధావన్
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు టీమిండియాలో చోటు దక్కపోవడం కాస్త బాధ కలిగించిందని ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. పొట్టి ఫార్మాట్‌లో పరుగుల వరద పారించినా.. సెలెక్టర్లు తనను పట్టించుకోలేదని వాపోయాడు. ఈ విషయంలో నిరాశ చెందిన మాట వాస్తవమే. కచ్చితంగా వరల్డ్‌కప్ జట్టులో చోటు సాధిస్తా. పరుగులు చేస్తాననే నమ్మకం కూడా ఉంది. ఏదేమైనా ప్రపంచకప్‌ను భారత్‌కు తెచ్చేందుకు నా శక్తి మేరకు శ్రమిస్తానని ధావన్ వ్యాఖ్యానించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications