For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అత్యధిక పరుగుల రికార్డు ధావన్-వార్నర్‌లదే

హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్లు శిఖర్‌ధావన్‌, డేవిడ్‌ వార్నర్‌ ఓ అరుదైన రికార్డు సాధించారు.

ఐపీఎల్‌ అన్ని సీజన్లలో వీరిద్దరూ కలిసి 1500 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తొలి ఓపెనింగ్‌ జోడీగా చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ అధికారిక ట్విట్టర్లో వారికి అభినందనలు తెలిపింది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఈ సీజన్‌లో ఇప్పటికే 15 మ్యాచ్‌లాడి 686 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన విరాట్‌ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు.

Shikhar Dhawan Made A Record With David Warner In Ipl

ఐపీఎల్‌లో మొత్తం 98 మ్యాచ్‌ల్లో 36.90 సగటు, 141.08 స్ట్రైక్‌రేట్‌తో 3,211 పరుగులు చేశాడు. రెండు శతకాలు సాధించాడు. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లాడిన శిఖర్‌ ధావన్‌ 473 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో మొత్తం 111 మ్యాచుల్లో 32.48 సగటు, 121.33 స్ట్రైక్‌రేట్‌తో 3054 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 95 నాటౌట్‌. 25 అర్ధశతకాలు నమోదు చేశాడు.

కాగా, ధావన్-వార్నర్ రికార్డు భాగస్వామ్యం తర్వాతి స్థానం కోల్‌కతా నైట్‌రైడర్స్ గౌతం గంభీర్, ఆ జట్టు ఆటగాడు రాబిన్ ఉతప్పలదే. వీరిద్దరూ కలిసి 1,463 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇది ఇలా ఉండగా, ఫైనల్ బెర్త కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు శుక్రవారం రాత్రి గుజరాత్ లయన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+